Almond Benefits: మెరుగైన ఆరోగ్యానికి అద్భుతమైన పరిష్కారం బాదం. బాదం క్రమం తప్పకుండా తింటే చాలా ప్రయోజనాలున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా డయాబెటిస్ రోగులకు అత్యంత లాభదాయకం. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. అందులో ముఖ్యమైంది బాదం. బాదంతో లెక్కకు మించిన ప్రయోజనాలున్నాయి. బాదం తినడం వల్ల శరీరానికి కావల్సిన కాల్షియం సంపూర్ణంగా లభిస్తుంది. గుండెపోటు ముప్పు తగ్గుతుంది. ఇవి కాకుండా ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దాం..


కొంతమందికి కాల్షియం లోపం ఉంటుంది. అటువంటి వారు డైట్‌లో బాదం చేర్చుకుంటే కావల్సినంత కాల్షియం సమకూరుతుంది. బాదంలో అద్భుత పోషకాలోత పాటు కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. బరువు తగ్గించుకోవాలనుకునేవారు క్రమం తప్పకుండా రోజూ బాదం తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల నెమ్మది నెమ్మదిగా బరువు తగ్గుతారు. రోజూ రాత్రిపూట నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


కేన్సర్ నుంచి సంరక్షణ


అన్ని వ్యాధుల్లో కేన్సర్ అత్యంత ప్రాణాంతకం. మీరు రోజూ తీసుకునే ఆహారంలో బాదంను భాగంగా చేసుకుంటే అద్భుత లాభాలుంటాయి. బాదం అనేది కేన్సర్‌ను చాలావరకూ దూరం చేస్తుంది. ఇక మరో అద్భుతమైన ఉపయోగం డయాబెటిస్ రోగులకు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో బాదం కీలకంగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ రోగులకు బాదం మంచి డైట్ కాగలదు.


Also read: Green Tea Side Effects: గ్రీన్ టీ అతిగా తాగితే అనర్ధాలే, రోజుకు ఎన్ని కప్పులు తాగొచ్చు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook