ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి(Stress)తో  కూడుకున్న వాతావరణంలో మనం నవ్వుతూ(Smiling) ఉండటం అనేది చాలా అవసరం. ఇందుకోసం లాఫర్ యోగా(Laughter Yoga) చేయడం శ్రేయస్కరం. నవ్వు అనేది మన నుంచి ఒత్తిడిని దూరం చేస్తుంది. దీంతో ముఖం కండరాలకు  వ్యాయామం అవుతుంది.  అంతేకాదు, నవ్వడంతో మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. లాఫర్ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే.  కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవ్వడంతో పాటు ఏడవడం (Crying) వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయని మీకు తెలుసా. ఒక పరిశోధన ప్రకారం.. అప్పుడప్పుడు ఏడవడం అనేది కూడా ఆరోగ్యాని(Health)కి మేలు చేస్తుందని తెలిసింది. అబ్బాయిలు ఏడుస్తుంటే అమ్మాయిలా ఏడుస్తావేంట్రా అని ఆటపట్టిస్తారు, అదే అమ్మాయిలు ఏడుస్తుంటే ఇక మొదలుపెట్టావా తల్లీ అంటూ జోక్స్ వేస్తారు. కానీ ఏడవడం ఎన్నో ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.. రోగ నిరోధక శక్తి పెరగడానికి సులువైన మార్గాలు


ఏడవడం వల్ల కలిగే ప్రయోజనాలు: (Benefits Of Crying)


  • ఎక్కువ సమయం ఏడవడం వల్ల ఆక్సిటోసిన్, ఇండ్రాఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇది ఫీల్ గుడ్ రసాయనం కావడంతో శారీరక, మానసిక భావేద్వేగాల సంబంధించిన మార్పులు కలుగుతాయి. వీటి వల్ల నొప్పిని తట్టుకునే సామర్థ్యం వస్తుంది. 

  • ఏడవడం వల్ల మెడదు ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త సంతులితం అవుతుంది. దీనివల్ల సంయమనంతో ఆలోచిస్తాం.

  • అప్పుడప్పుడు ఏడవటం ద్వారా మన బీపీ (Blood pressure) కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడటాన్ని తగ్గిస్తుంది.

  • కన్నీళ్ల రాల్చడం ద్వారా కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోతాయి. కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్ క్రిములు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

  • చెడు ఆలోచనల్ని దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతత కల్పించి పాజిటివ్ ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది.


దీనిని బట్టి ఆరోగ్యవంతమైన జీవితం కోసం నవ్వడంతో పాటే ఏడవడం కూడా చాలా ముఖ్యం అని తెలుస్తుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ