Sabja Seeds: కొవ్వును కరిగించే సబ్జాగింజలను ఇలా తినండి..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
Health Benefits of Sabja Seeds: ఎండకాలం కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు.. సాధారణంగా సబ్జాగింజలు బేసిల్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ సబ్జా గింజలు చూడటానికి నల్లగా కొద్దిగా ఓవల్ లేదా రౌండ్ షేప్ లో ఉంటాయి. అలాగే వీటిలో డైటరీ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి.
Health Benefits of Sabja Seeds: ఎండకాలం కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు.. సాధారణంగా సబ్జాగింజలు బేసిల్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ సబ్జా గింజలు చూడటానికి నల్లగా కొద్దిగా ఓవల్ లేదా రౌండ్ షేప్ లో ఉంటాయి. అలాగే వీటిలో డైటరీ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ కె విటమిన్ ఎ. ఐరన్. అలాగే ప్రొటీన్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.మెయిన్ గా సబ్జా గింజల్లో డైటరీ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో ఈ సబ్జా గింజలను తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి మలబద్దకంతో బాధపడే వారికి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి అసిడిటీతో బాధపడేవారికి ఈ సబ్జా గింజల అనేవి చాలా ఉపయోగ పడుతూ ఉంటాయి.
ప్రధానంగా సబ్జా గింజల్లో విటమిన్ కే ఉండడం వల్ల ఎవరికైతే హెల్త్ సమస్యలు ఉంటాయా? వారు కూడా ఈ సబ్జా గింజలను ప్రతి రోజూ తీసుకోవచ్చు. అలాగే స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నవారికి సబ్జాగింజల వల్ల చర్మం కాంతి వంతంగా ఉండడానికి కూడా ఈ సబ్జా గింజలు చాలా సహాయపడుతూ ఉంటాయి. సబ్జాగింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌లో కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది కొవ్వును కాల్చివేస్తుంది శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు తగ్గిపోతారు..
ఇదీ చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు షుగర్ వ్యాధి వచ్చినట్లే.. ఇలా జాగ్రత్తపడకపోతే ప్రమాదమే..!
ఈ సబ్జా గింజలు ఎలా తీసుకోవాలి?
సబ్జాగింజలను ఎప్పుడైనా నానబెట్టినవి తీసుకోవాలి. కానీ, డ్రైగా ఉన్నవి ఎప్పుడూ తీసుకోకూడదు. నానబెట్టకుండా తీసుకున్నట్లయితే రాష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే గొంతులో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా మనం సబ్జా గింజలను నానబెట్టి తీసుకోవాలి.
ఇదీ చదవండి: కీరదోసకాయ ఆరోగ్యానికి మహాభాగ్యం.. వేసవి తాపాన్ని తగ్గించే అద్భుత ఔషధం..
సబ్జాగింజలు తీసుకుంటే 100 గ్రాములు సబ్జా గింజలు తీసుకోవాలి. ఈ సబ్జా గింజలని కొద్దిగా గోరువెచ్చని నీళ్లలో వేయాలి. వీటిని కనీసం 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత ఈ గింజలని కొద్దిగా తీసుకుని అందులో నీళ్లు కలుపుకుని తాగాలి. ఎండకాలం వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. వీటిని ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాలను పొందుతారు. ఇందులో ఉప్పు లేదా తేనె కలుపుకొని తాగాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook