Sapota For Weight Loss: సపోటా పండు మార్కెట్లో తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. అయితే, తక్కువ ధరే కదా.. అని తీసిపారేయకండి. ఈ పండుతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు సపోటా పండును మన డైట్లో చేర్చుకుని సులభంగా బరువు కూడా తగ్గొచ్చు.సపోటా రుచి తీయగా ఉంటుంది. దీంతో అనేక పోషకాలు కూడా ఉంటాయి.అయితే, ఈ పండు తింటూ మీరు బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఈ తీయని పండును తింటూనే మొండి బొడ్డుకొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. సాధారణంగా పండ్లు కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళ్లినప్పుడు యాపిల్‌, అరటి, నారింజ కొనుగోలు చేస్తాం. అయితే, ఈ సారి వెళ్లినప్పుడు మాత్రం సపోటా కొనుగోలు చేయండి. వీటి ధర తక్కువ మాత్రమే కాదు.. ఇందులో ఉండే పోషకాలతో బరువు తగ్గుతారు. జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పోషకాలు..
సపోటా పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు జీవక్రియని మెరుగుపరుస్తుంది. మొండి బొడ్డుకొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. సపోటా పండులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫోలేట్ ఉంటాయి. ఇవి సులభంగా మీ మొండి బొడ్డు కొవ్వును కాల్చేస్తాయి. అంతేకాదు సపోటాలు మన డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఈ పోషకాల పండును తీయగా ఆస్వాదిస్తూనే బరువు తగ్గొచ్చన్నమాట.


జీవక్రియ..
సపోటా పండు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇది మన శరీరంలో ఉండే అదనపు కేలరీలను కరిగించేస్తాయి. అంతేకాదు సపోటా పండులో సహజ చక్కెర ఉంటుంది. దీంతో బరువు పెరుగుతామనే భయం ఉండదు. హాయిగా సపోటా పండును తినవచ్చు. సపోటా పండు తినడం వల్ల కూడా షుగర్ వస్తుందనే భయం ఉండదు. ఇందులో ఉండే విటమిన్లు మన శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి.  రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఈ సపోటా పండు కాపాడుతుంది. కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ తీపి పండును తినేముందు వైద్యుల సలహా తీసుకోవాల్సిందే.


ఫైబర్..
సపోటా పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్య కూడా దరిచేరదు.. అంతేకాదు సపోటా పండును మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయడదు. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరగరు. ఇది ఎక్కువ ఆహారం తీసుకోకుండా నిరోధిస్తుంది. సపోటా పండును మన డైట్లో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది.


ఇదీ చదవండి:  నెరియం ఒలియాండర్ ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా!



జీర్ణ ఆరోగ్యం..
సపోటా పండు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇవి చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లు మన జీర్ణ ఆరోగ్యాన్ని సులభతరం చేయడంలో సహాయపడుతుంది.  పేగు కదలికలకు సపోటా పండు ఎంతగానో సహాయపడుతుంది. అంటే ఆరోగ్యంగా ఉంటూనే సులభంగా బరువు కూడా తగ్గొచ్చు. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తమ డైట్లో సపోటా పండును చేర్చుకోవచ్చు.


ఇదీ చదవండి: ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ డైట్‌లో ఈ తామర పువ్వుల వేర్లను వినియోగించండి!


మంచి స్నాక్..
సపోటా పండును పిల్లలు పెద్దలు తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. కానీ, చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటేసరికి ఇందులో పోషకాల సమృద్ధిగా ఉంటాయో? లేవో? అనే అనుమానం ఉంటుంది. సపోటా పండును మన సాయంత్రం స్నాక్‌గా కూడా తినవచ్చు. వేరే పండ్లతో పోలిస్తే సపోటా పండులో కేలరీల స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీంతో రుచిని ఆస్వాదిస్తూనే బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఈసారి మార్కెట్‌కు వెళ్లినప్పుడు కచ్చితంగా సపోటాను మీరు కూడా కొనుగోలు చేయడం మర్చిపోకండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter