Sugarcane Juice Benefits: సాధారణంగా ఎండాకాలం ప్రారంభం ముందే ఎన్నో చెరుకు రసాల స్టాల్స్ మనకు మార్కెట్లో కనిపిస్తాయి. వేరే జ్యూసులతో పోల్చుకుంటే ఈ రసాన్ని తక్కువ తాగుతారు. కానీ, ఇందులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తెలిస్తే మీరు ఈరోజు నుంచి చెరుకురసం తాగడం మొదలు పెడతారు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. చెరుకురసంలో ఫైబర్ 13 గ్రాములు ఉంటుంది. వేసవిలో చల్లదనం కోసం చెరుకురసం తాగడం మేలు. ఇందులోని అనేక గుణాలు దీనిని ఉత్తమ పానీయంగా మారుస్తాయి.


2. చెరుకురసం హెల్తీ డ్రింక్ ఎందుకంటే ఇంది ప్రాసెస్ చేయనిది.  ఫినాలిక్ ,ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది తాగడం వల్ల క్యాన్సర్‌ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు.


ఇదీ చదవండి: మిల్క్‌లో జాజికాయ పొడిని కలుపుని తాగితే శరీరానికి బోలెడు లాభాలు!



3. చెరుకురసం కాలేయం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అందుకే కామెర్లు వచ్చినప్పుడు చెరకు రసం తాగడం మంచిది.చెరకు రసంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను నిర్వహిస్తుంది. 


4. వ్యాయామం తర్వాత అలసట నుండి ఉపశమనం పొందడానికి చెరకు రసం తాగొచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా కండరాలలో శక్తి పునరుద్ధరించబడుతుంది. చెరకు రసం తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. దీన్ని స్పోర్ట్స్ డ్రింక్‌గా ఉపయోగించవచ్చు. 


5. ఈ రసం తాగడం వల్ల శరీరంలో నీరు ,ఎలక్ట్రోలైట్స్ కొరత ఉండదు. మలబద్ధకం సమస్య మనల్ని బాధించదు. చెరకు రసంలో  పీచు ఉంటుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. 


6. కొలెస్ట్రాల్, సోడియం ఉండదు. అందువల్ల ఇది కిడ్నీలకు కూడా ఆరోగ్యకరం. దీన్ని తాగడం వల్ల కిడ్నీలు బలపడతాయి. చెరకు రసం మూత్రపిండాలకు కూడా మేలు చేస్తుంది. 


ఇదీ చదవండి: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ మంచిదా కాదా


7. అంతేకాదు చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. బరువు తగ్గడానికి చెరకు రసం కూడా మంచి డ్రింక్.
జీవక్రియను పెంచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా మనల్ని రక్షిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook