Custard apple: ఇమ్యూనిటీ పెంచే ఈ సీజనల్ ఫ్రూట్ గురించి మీకు తెలుసా?
Sitaphal: ఈ సీజన్ లో ఎటు చూసినా పచ్చగా,అందంగా, మంచి సువాసనతో సీతాఫలాలు నోరూరిస్తూ కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని తినడానికి సంకోచిస్తారు. సీతాఫలాలు ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయని అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామందికి తెలియదు. సీతాఫలాల విశిష్టత తెలుసుకుందాం పదండి..
custard apple: కమ్మటి వాసనతో మనం ఎంత దూరంలో ఉన్న తన వైపు అట్రాక్ట్ చేసే టేస్టీ ఫ్రూట్ సీతాఫలం. తెల్లని గుజ్జు మధ్యలో నల్లని విత్తనాలు అబ్బా..తింటుంటే స్వీట్లు కూడా దీని తీపి ముందు దిగదుడుపే అనిపిస్తుంది. కానీ మనలో చాలామంది ఈ టేస్టీ ఫ్రూట్ ని తినడానికి 100 సార్లు ఆలోచిస్తారు .ఎందుకంటే ఈ ఫ్రూట్ ని తింటే లావు పెరుగుతారని ,షుగర్ పెరుగుతుందని, జలుబు చేస్తుందని రూమర్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే.. మరి ఈ ఫ్రూట్ తింటే మనకు కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందామా..
అమృతంలా రుచిగా ఉండే ఈ పండు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా ఎంజాయ్ చేస్తారు. సీతాఫలంలో విటమిన్ సి తో పాటు ఎ, బి, కె విటమిన్లు పుష్టిగా దొరుకుతాయి.. అంతేకాదు ప్రోటీన్ ,క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ,పొటాషియం, ఐరన్ ఇలా మన ఇమ్యూనిటీని పెంచే ఎన్నో పోషక విలువలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సీతాఫలం అద్భుతంగా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి సీతాఫలం దివ్య ఔషధం. ఇందులో లభించే కాపర్ మనం తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
సీతాఫలంలో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ..ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది. అంటే ఇది తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గుతామే తప్ప పెరిగే ఆస్కారం చాలా తక్కువ. పైగా ఇందులో దొరికే విటమిన్ బి6 ఉదర సంబంధిత ఎన్నో సమస్యలకు పుల్ స్టాప్ పెడుతుంది. సీతాఫలం రెగ్యులర్ గా తీసుకుంటే కడుపుబ్బరం, గ్యాస్ ,అజీర్తి, అల్సర్ లాంటి ఎన్నో ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
మీకు పీసీఓఎస్ సమస్య ఉంటే మీరు తప్పకుండా సీతాఫలాన్ని తీసుకోవాలి. ఈ సమస్యకు ముఖ్య కారణం మన హార్మోన్ లోని అసమతుల్యత. ఇది అలసట, నీరసం, చికాకు వంటి సమస్యలకు దారితీస్తుంది. సీతాఫలంలో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి ఇది ఈ సమస్యలన్నిటిని దూరం చేస్తుంది. గర్భిణీలు ఎక్కువగా మలబద్ధకం సమస్యతో బాధపడతారు. అటువంటి వారు సీతాఫలం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు. శరీరంలో మెగ్నీషియం శాతాన్ని పెంచి గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా సీతాఫలం సహాయపడుతుంది.
ఇక ఈ పండు చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి ఇది తింటే తమ చక్కెర శాతం ఎక్కడ పెరుగుతుందో అని డయాబెటిస్ పేషంట్స్ తెగ బాధపడతారు. అయితే సీతాఫలంలో నిజానికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది .. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా ఈ పండుని నిస్సంకోచంగా మితమైన మోతాదులో తీసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ సీజనల్ ఫ్రూట్ ని అందరూ ఎంజాయ్ చేయండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం అయినది కావున కొత్తవి ప్రయత్నించే ముందు ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook