Amla Powder For Diabetes And Weight Loss: ఉసిరి ఎక్కువగా మనకు శీతాకాలంలో లభిస్తుంది. మిగతా కాలాల్లో పచ్చి ఉసిరి, దీనితో తయారుచేసిన రసం లభించడం చాలా కష్టం. పచ్చి ఉసిరిలో ఉన్న ప్రయోజనాలే ఎండిన ఉసిరిలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని సూపర్ మార్కెట్లలో ఎండిన ఉసిరి విచ్చలవిడిగా లభిస్తుంది. వీటితో తయారుచేసిన పొడిని వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులను సైతం శరీరం నుంచి దూరం చేయగలుగుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఎండిన ఉసిరి పొడిలో విటమిన్ సి కూడా అధిక మోతాదులో లభిస్తుంది. క్రమం తప్పకుండా పాలలో కలుపుకొని తాగడం వల్ల సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు ఇతర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. వాన కాలంలో తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి కూడా ఉసిరి పొడి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పొడిని ప్రతిరోజు పాలలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.


Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


ప్రతిరోజు ఎండిన ఉసిరి ముక్కలను తినడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు వారు ప్రతి రోజు ఎండిన ఉసిరిముక్కలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా చర్మ సమస్యలు ఉన్నవారు కూడా దీనితో తయారు చేసిన మిశ్రమాన్ని వినియోగించడం వల్ల చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది. కాలుష్యం కారణంగా వచ్చే మొటిమలు మచ్చలు కూడా తొలగిపోతాయి.


ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ ఉసిరి పొడిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ పొడిని వాడడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉసిరి పొడిలో ఉండే మూలకాలు ఒత్తిడిని కూడా సులభంగా నియంత్రిస్తాయి. 


Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook