Pomegranate Peels can Cure the Anemia, Hypertension: దానిమ్మ పండ్లు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఉండే గుణాలు రక్తంలోని కీమోగ్లోబిన్ ను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం చాలామంది వాటిని తినే క్రమంలో వాటిపై తొక్క పడేస్తూ ఉంటారు. అయితే దానిమ్మ గింజలతోనే కాకుండా తొక్క వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదంలో చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. దానిమ్మ గింజలే కాకుండా దానిమ్మ తొక్కలో ఉండే గుణాలు రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామందిలో రక్తహీనత, రక్తపోటు సమస్యలు వస్తున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా దానిమ్మ తొక్కలు ప్రభావవంతంగా సహాయపడతాయి ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి మీరు దానిమ్మ తొక్కల నుంచి తీసిన రసాన్ని క్రమం తప్పకుండా తాగాల్సి ఉంటుంది. తాగడం వల్ల రక్తహీనత తగ్గడమే కాకుండా రక్తంలో పేరుకుపోయిన మలినాలు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారా?:
ఆధునిక జీవనశైలి అనుసరించడం వల్ల చాలామంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా దానిమ్మ తొక్కల రెసిపీని వినియోగించాల్సి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా వాడడం వల్ల జీర్ణ క్రియ సమస్యలే కాకుండా పొట్ట సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!


దానిమ్మ తొక్కలతో తయారు చేసిన పొడి:
ముందుగా దానిమ్మ తొక్కలను పండ్ల నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. వాటిని బాగా కడిగి కొద్దిసేపు ఆర పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టి దాని పైనుంచి కాటన్ గుడ్డను వేయాలి. ఇలా అవి పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి పొడిలా చేసుకుని ఓ డబ్బాలో భద్రపరుచుకుని.. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత పొడిని పాలలో కలుపుకొని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా పై అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.


Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook