Anjeer for Healthy Lifestyle: అంజీర్.. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇమిడి ఉన్న పండ్లలో ఇది కూడా ఒకటి. ఇందులో పోషకాలు మెండుగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కావాల్సిన అన్ని ప్రయోజనాలను.. కలిగిస్తుంది. ఇకపోతే ఈ పండ్లను కొంతమంది ఉదయం తింటే మరికొంతమంది సాయంత్రం వేళ తింటూ.. ఉంటారు. ఇంకొంత మంది ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తింటూ ఉంటారు.. అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే మాత్రం.. ఒక నిర్దిష్ట సమయంలోనే తినాలని చెబుతున్నారు నిపుణులు.. మరి వీటిని ఎప్పుడు తినాలి..? ఉదయం తింటే కలిగే ప్రయోజనాలు ఏంటి? సాయంత్రం తింటే కలిగే ప్రయోజనాలు ఏంటి?  పూర్తి ప్రయోజనాలు కలగాలంటే ఏ సమయంలో తినాలి?అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయాన్నే తింటే కలిగే ప్రయోజనాలు..


అంజీర్ పండ్లను ఉదయాన్నే తింటే ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి.. ఇందులో ఉండే న్యాచురల్ షుగర్స్  శక్తి స్థాయిలను పెంచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.. మలబద్దకం,  అజీర్తి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ పండ్లు మన ఆకలిని నియంత్రించడానికి చాలా చక్కగా సహాయపడతాయి. ముఖ్యంగా అంజీర్ పండ్లను ఉదయాన్నే తినడం వల్ల వేరే ఆహారం పైన దృష్టి మల్లదు.. ఫలితంగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు,  అజీర్తి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే అంజీర్ పండ్లను తింటే ఈ సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. 


సాయంత్రం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


సాయంత్రం పూట వీటిని తింటే నిద్ర హాయిగా పడుతుంది.. ఇతర జంక్ ఫుడ్ తినాలనే కోరిక పుట్టదు.. ఈ పండు ఫ్రెష్ గా తినవచ్చు.. లేకపోతే ఎండబెట్టి నీటిలో నానబెట్టి తిన్నా సరే ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో లభించే మెగ్నీషియం మీ కండరాలను సడలించి మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.  ఈ అంజీర్ పండ్లు ఫైబర్ కి మంచి వనరులు జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడతాయి.. అంజీర్లో విటమిన్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. ముఖ్యంగా విటమిన్ ఏ , ఈ, కే లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మెగ్నీషియం,  పొటాషియం వంటివి కూడా ఎక్కువగానే లభిస్తాయి. 


అంజీర్ పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు శరీరమంటను,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.. రెగ్యులర్ గా తింటే రక్తపోటు ఉండదు.. ఇందులో ఉండే కాల్షియం,  ఫాస్ఫరస్ ఎముకలను ఆరోగ్యంగా బలంగా ఉంచుతాయి. ఇకపోతే ఏ సమయంలో తిన్నా  సరే ప్రయోజనాలు కలుగుతాయి.. కాబట్టి ఉదయం సాయంత్రం మీకు అనుకూలంగా ఉండే సమయాన్ని కేటాయించుకొని వీటిని తినవచ్చు.


Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..


Also Read:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి