Antibiotics: వైరల్ జ్వరాలనేది ఇటీవలి కాలంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. అటు ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా యాంటీ బయాటిక్స్ తీసుకుంటున్నారు. మరి ఇవి ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి సమయంలో యాంటీ బయోటిక్స్ చాలా విస్తృతంగా వినియోగించారు. ముఖ్యంగా వైరల్ రోగాలు సోకిన ప్రతిసారీ యాంటీ బయోటిక్స్ మందులు ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. అది కూడా వైద్యుడి సలహా లేకుండానే. ప్రతి చిన్నదానికీ ఇలా మందులు వాడటం ఆరోగ్యానికి హానికారకంగా మారుతుంది. 2019లో ఒక్క ఇండియాలోనే 5 వందల కోట్ల రూపాయల యాంటీ బయాటిక్స్ వాడకం జరిగిందని ది లాన్సెట్ నివేదిక సారాంశం. డాక్టర్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు తెలుసుకుందాం..


బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ చికిత్స కోసం యాంటీబయోటిక్స్ వాడుతుంటారు. ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రిస్తుంది. ప్రతి వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు ఇవి పనిచేయవని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి చిన్న ఇన్‌ఫెక్షన్‌కు యాంటీబయోటిక్స్ అవసరం లేదు కూడా. 


ప్రతి సమస్యకు యాంటీబయోటిక్స్ వినియోగించకూడదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్ ఎలాంటిది, యాంటీబయోటిక్స్ డోస్ ఎంత ఉండాలి, ఎన్ని వాడాలి అనేది తెలుసుకుని వినియోగించాల్సి ఉంటుంది. ప్రతి చిన్న ఇన్‌ఫెక్షన్‌కు యాంటీబయోటిక్స్ వాడటం వల్ల చాలా ప్రమాదకర బ్యాక్టీరియాలు వీటికి వ్యతిరేకంగా రెసిస్టెన్స్ పెంచుకుంటాయి. మరోవైపు కిడ్నీ, లివర్ సమస్యలకు దారి తీస్తుంది. అందుకే వైద్యుడి వద్దకు ఎప్పుడు వెళ్లినా..మీ పాత సమస్యలు కూడా చెప్పాల్సి వస్తుంది. తద్వారా యాంటీబయోటిక్స్ రాసేటప్పుడు వైద్యుడికి సరైన అవగాహన వస్తుంది. 


యాంటీబయోటిక్స్ ఎవరు వాడకూడదు


కిడ్ని సమస్యలతో బాధపడుతున్నవారు యాంటీబయోటిక్స్‌కు దూరంగా ఉండాలి. చిన్నారులకు యాంటీబయోటిక్స్ ఇచ్చే ముందు వైద్యుడి సలహా తీసుకుంటుంటారు. కొంతమందికి యాంటీబయోటిక్స్ అంటే ఎలర్జీ ఉంటుంది. గుండెవ్యాధి రోగులు కూడా వీటికి దూరంగా ఉండాలి. వృద్ధులకు ఇష్టారాజ్యంగా యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదు.


Also read: Weight Loss Tips: బరువు తగ్గే క్రమంలో ఈ టీలను తాగితే.. వేగంగా, ఆరోగ్యంగా, సులభంగా తగ్గుతారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook