Herbal Tea For Weight Loss: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఔషధాలతో కూడిన పలు రకాల టీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీలను తీసుకోవడం వల్ల సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి.. సులభంగా బరువు తగ్గుతారు. అయితే ఈ టీలను తీసుకునే క్రమంలో పాలను తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి ఎలాంటి టీలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి ఈ టీలను తీసుకోవాల్సి ఉంటుంది:
బ్లాక్ టీ:
బ్లాక్ టీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ప్రతి రోజూ రెండు మూడు సార్లు ఈ టీలను తీసుకోవడం సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ టీల్లో బరువు తగ్గడానికి కావాల్సిన చాలా రకాల మూలకాలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ టీని తీసుకోవాలి.
జీలకర్ర టీ:
బరువు తగ్గడానికి జీలకర్ర టీ ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరిచి..బరువు తగ్గించడానికి ప్రభావవంతంగా పని సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ టీని రోజూ తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
సోపు టీ:
సోపు టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ టీని ఎక్కువగా గుజరాత్లో తీసుకుంటారు. అయితే ఈ టీని తయారు చేసుకోవడానికి ముందుగా నీళ్లలో సోపును నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని మరిగించి తీసుకోవాలి.
గులాబీ ఆకుల టీ:
గులాబీ ఆకులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని యాక్టివ్‌గా చేస్తాయి. అయితే ఈ ఆకులతో చేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనిని మార్నింగ్ డ్రింక్‌గా తయారు చేసుకుని కూడా తాగొచ్చు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook