Covid Antibodies: వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు నెలల్లోనే పడిపోతున్న యాంటీబాడీలు
Covid Antibodies: కరోనా మహమ్మారి నియంత్రణకు కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఓ వైపు చెబుతుంటే..మరోవైపు అందుకు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న 4 నెలలకే యాంటీబాడీలు పడిపోతున్నాయనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Covid Antibodies: కరోనా మహమ్మారి నియంత్రణకు కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఓ వైపు చెబుతుంటే..మరోవైపు అందుకు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న 4 నెలలకే యాంటీబాడీలు పడిపోతున్నాయనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
కరోనా సంక్రమణ (Corona Spread)ఇంకా కొనసాగుతోంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమనే వాదన బలపడుతుండగానే..అందుకు భిన్నమైన ఫలితాలు ఆందోళన కల్గిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్(Covid Vaccination) తీసుకున్న 4 నెలల కాలంలోనే యాంటీబాడీలు(Antibodies) గణనీయంగా తగ్గిపోతున్నాయనే వార్తలు దీనికి కారణం. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 614 మంది హెల్త్ వర్కర్లలో యాంటీబాడీలు భారీ సంఖ్యలో తగ్గిపోయాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతమంది హెల్త్ వర్కర్లలో యాంటీబాడీలు భారీగా తగ్గడంతో కరోనా బూస్టర్ డోసు తీసుకోవాలా వద్దా అనే ఆలోచన ప్రారంభమైంది. యాంటీబాడీలు తగ్గిపోతే కరోనా వ్యాధి నుంచి తట్టుకుని ఉండలేమనే సందేహాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బాడీ మెమరీ సెల్స్ గణనీయమైన రక్షణ కల్పిస్తాయని కూడా అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కరోనా రెండు డోసులు పూర్తయిన ఆరు నెలల తరువాతైనా బూస్టర్ డోసు(Corona Booster Dose) తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని భువనేశ్వర్‌లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ చెబుతోంది. పాన్ ఇండియా డేటా ఆధారంగా మరికొన్ని ప్రాంతాల్లో అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు(Astrazeneca Vaccine) తీసుకున్నవారిలో ఆరు నెలల్లోనే వ్యాక్సిన్ పనితనం కోల్పోతుందని బ్రిటీషు పరిశోధకులు వెల్లడించారు. ఇదే స్టడీలో కోవిషీల్డ్(Covishield), కోవాగ్జిన్‌పై కూడా అధ్యయనం జరిగింది.దేశంలో ఇప్పటి వరకూ 944 మిలియన్ల మందికి రెండు డోసులు పూర్తి కాగా..60 శాతం మంది ఒక డోసు తీసుకున్నారు. మరో 19 శాతం రెండవ డోసు తీసుకోవల్సి ఉంది. ఇప్పుడు యాంటీబాడీలు తగ్గిపోతున్నాయనే వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా బూస్టర్ డోసు విషయంలో స్పష్టత రావల్సిన అవసరముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Cancer Treatment: కేన్సర్ చికిత్సలో గొప్ప ఆవిష్కరణ, లక్షణాలు లేకుండానే గుర్తింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook