Apple Precautions: యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అన్నారు. నిజమే యాపిల్ నిజంగానే ఆరోగ్యానికి మంచిది. అయితే యాపిల్ తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. యాపిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసు. యాపిల్ ఎంత రుచిగా ఉంటుందో..అంతే ఆరోగ్యకరం కూడా. ఇందులో పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా యాపిల్ తింటుంటే..దీర్ఘ కాలిక రోగాలు సైతం దూరమౌతాయి. అయితే యాపిల్ తినేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. యాపిల్ తిన్న తరువాత కొన్ని పదార్ధాలు పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినకూడదని ఆ పదార్ధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ముఖ్యంగా యాపిల్ తిన్న వెంటనే ఎప్పుడూ నీళ్లు తాగకూడదు. అలా తాగితే శరీరంలోని పీహెచ్ స్థాయి బ్యాలెన్స్ తప్పుతుంది. ఫలితంగా జీర్ణక్రియలో సమస్య, ప్రేగుల్లో వాపు, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. దాంతోపాటు చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. ఇక యాపిల్‌తో పాటు లేదా యాపిల్ తిన్న తరువాత ఎప్పుడూ ముల్లంగి తినకూడదు. ఎందుకంటే రెండూ చలవ చేసే పదార్ధాలే. ఫలితంగా కఫం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. 


ఇక మరో ముఖ్యమైనది పులుపు పండ్లు తినకూడదు. యాపిల్ తిన్న తరువాత ఉసిరి, నిమ్మ, ఆరెంజ్ వంటివి తినకూడదు. వీటివల్ల కడుపులో సైట్రిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా కడుపు లేదా ఛాతీలో మంట సమస్యగా మారుతుంది. అదే విధంగా యాపిల్ తిన్న తరువాత పికిల్స్ కూడా తినకూడదు. ఇది కూడా సైట్రిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. 


Also read: Green Tea Side Effects: గ్రీన్ టీ అతిగా తాగితే అనర్ధాలే, రోజుకు ఎన్ని కప్పులు తాగొచ్చు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook