Honey for weight loss:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరగడుపున గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు శరీరంలో కొవ్వు శాతం కూడా కరుగుతుంది. అయితే కొంతమందికి తెలియని విషయం ఏమిటంటే మరి ఎక్కువ వేడిగా ఉన్న నీటిలో తేనెను కలపడం వల్ల అది శరీరాన్ని నిర్విషీకరణ  చేస్తుంది. ఎందుకంటే తేనె వేడి నీటిలో కలిసినప్పుడు తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. పైగా తేనె యొక్క నాణ్యత కూడా దెబ్బతింటుంది .


మనం ఎప్పుడైనా తేనెను గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగాలే తప్ప మరిగే నీటిలో అస్సలు కలపకూడదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేడి నీటిలో తేనె కలపడం వల్ల ప్రయోజనం కంటే కూడా దుష్ప్రయోజనాలు ఎక్కువ .కాబట్టి ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనం తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి.


బయట దొరికే ప్రాసెస్ తేనెల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మార్కెట్లో దొరికే కొన్ని నాసిరకమైన తేనెలు ఎక్కువ శాతం చక్కెర నిల్వలు కలిగి ఉంటాయి. అటువంటి వాటికంటే కూడా సహజంగా దొరికే వాక్యాన్ని కానీ వాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే గోరువెచ్చటి నీటిలో తేనె కలిపిన వెంటనే సేవించాలి. ఎక్కువసేపు అలా తినను కలిపిన నీటిని బయట ఉంచకూడదు అలాగని దాన్ని ఫ్రిజ్లో కూడా పెట్టకూడదు.


మీరు తేనెను ఎప్పుడు కూడా గాజు సీసాలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తప్ప స్టీల్ సీసాలు వాడడం లేక ఫ్రిజ్లో పెట్టడం వంటివి చేయకూడదు. కేవలం గౌరవెచ్చటి నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగడం వల్ల బరువు తగ్గటం అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. బరువు తగ్గాలి అనుకున్న వాళ్లు సరియైన ఆహారపు అలవాట్లతో పాటు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే మనం తీసుకొని ఆహారంలో తాజా పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట త్వరగా పడుకొని పొద్దున తెల్లవారుజామున నిద్రలేయడం అలవాటు చేసుకోవాలి.


గమనిక:
ఇక్కడ ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడమైనది .ఏదైనా ఫాలో అయ్యే ముందు మీరు మీ డాక్టర్ ను ఒకసారి సంప్రదించాలి.


ఇది కూడా చదవండి: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు


ఇది కూడా చదవండి: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్