COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ash Gourd Juice Benefits In Telugu: ప్రతి రోజు గుమ్మడికాయ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, మాంగనీస్, జింక్‌తో పాటు ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. కాబట్టి గుమ్మడికాయ రసం తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో ఉండే కొన్ని మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర శక్తిని పెంచి బరువును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయి. 


గుమ్మడికాయ రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం: 
గుమ్మడికాయలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే తీవ్ర పొట్ట సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. 


బరువు తగ్గడానికి..: 
గుమ్మడి రసంలో తక్కువ కేలరీలు, అధికంగా నీటి శాతం ఉంటుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే గుమ్మడి రసం తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు ఆకలిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.


చర్మానికి కాంతివంతం: 
గుమ్మడికాయ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఎండ వల్ల కలిగే నష్టాల నుంచి కూడా రక్షిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.


హృదయానికి ఆరోగ్యం: 
పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. దీంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. 


షుగర్ లెవెల్స్‌కు చెక్‌:
గుమ్మడికాయ రసం షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరం కూడా చాలా చల్లబడుతుంది. కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.