Health Tips: ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు
మీకు ఈ సమస్యలు ఉంటే మాత్రం పసుపు కలిపిన పాల నుంచి దూరంగా ఉండండి.
పాలలో పసుపు కలిపి ( Turmeric Milk ) తాగితే ఆరోగ్యానికి ( Health ) చాలా మంచిది అని మనం చాలా సార్లు వినే ఉంటాం. తరచూ పసుపు పాలు తాగి ఉంటాం కూడా. వైద్యులు కూడా పసులు పాలు తాగమని చెబుతుంటారు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్ ( Sachin Tendulkar ) కూడా తన ఆరోగ్య రహస్యం పసుపు పాలే అంటారు. ఎందుకంటే ఇది రోగ నిరోధక శక్తిని ( Immunity ) పెంచుగుతుంది. యాంటీబయాటిక్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం పసుపు కలిపి పాలను సూపర్ మిల్క్ అని అనవచ్చట. అయితే మీకు ఈ సమస్యలు ఉంటే మాత్రం పసులపు కలిపిన పాల నుంచి దూరంగా ఉండండి.
ఇలా దగ్గు ఉంటే..
- బాగా దగ్గు ఉండి లోపల పేరుకున్న ప్లేగ్మ ( Phlegm ) అంటే కఫం బయటికి రానప్పుడు .. ఛాతి భాగంలో ఏదో పట్టేసినట్టు గా ఉంటుంది. అప్పుడు పసుపు పాలు తాడడం మంచిది కాదు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే...
- మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే నిద్రకు ఉపక్రమించడానికి ముందు తీసుకోవడం సరికాదు.
- ఛాతి నొప్పిగా ఉన్నప్పుడు పసుపు పాలు తీసుకోరాదు.
- పసుపులో ఉండే పోషకాలు ఎంత శక్తివంతం అయినవి అంటే అది మీ శ్వాసక్రియ పనితీరును వేగం చేస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
- మీరు శ్వాస కోసం పంపు వాడుతున్నట్టు అయితే పసుపు పాలు తీసుకోండి.
ఈ చిట్కాలు పాటించి మీ లైఫ్ స్టైల్ ను ( Life style ) జాగ్రత్తగా మెయింటేన్ చేసుకోండి.