Ayurvedic Remedies For Fatty Liver: ఫ్యాటీ లివర్‌ అంటే లివర్‌లో అధికంగా ఫ్యాట్‌ పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇది ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది. కొన్ని రకాల మోడ్రన్‌ మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆయుర్వేదంలో కూడా కొన్ని రెమిడీలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పసుపు..
పసుపును గోల్డెన్‌ స్పైస్‌ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో పసుపును విస్తృతంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పసుపులో యాంటా ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. పసుపులో ముఖ్యంగా కర్కూమిన్ ఉంటుంది. ఇది లివర్‌ మంట సమస్యను తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నివారిస్తుంది. పసుపు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఫ్యాటీ లివర్‌ సమస్య తగ్గిపోతుంది. పసుపును పాలు, కూరల్లో వేసుకుని తీసుకోవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


గిలోయ్‌..
గిలోయ్‌ను గుడుచీ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఆయుర్వేదంలో పవర్‌ఫుల్‌ మూలిక. ఇందులో డిటాక్సిఫై చేసే గుణాలు కూడా ఉంటాయి. గిలోయ్‌ లివర్‌ సెల్స్‌, కాలేయ పనితీరును మెరుగు చేస్తుంది. ఇది నేచురల్‌ హెపటప్రొటెక్టీవ్‌ ఏజెంట్‌ గా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్‌ సమస్యను గిలోయ్‌ నిర్వహిస్తుంది. గిలోయ్‌ తో జ్యూస్‌ లేదా పొడి, క్యాప్సూల్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.


ఇదీ చదవండి: పిల్లలకు డెంగీ వచ్చినప్పుడు ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి.. వాటి లక్షణాలు ఇలా ఉంటాయి..


ఉసిరి..
ఉసిరిలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఉసిరి కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీర ఆరోగ్యానికి కూడా ఉసిరి మంచిది. ఉసిరి లివర్‌ను నేచురల్‌గా డిటాక్సిఫై చేస్తుంది. సహజసద్ధమైన ఉసిరి లివర్‌ డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియలో కాలేయంపై అదనపు కొవ్వును తొలగిస్తుంది. తాజా ఉసిరి రసాన్ని తీసుకోవాలి. నేరుగా తీసుకోలేనివారు తేనె లేదా నీటిని కలిపి తీసుకోవాలి.


త్రిఫల..
త్రిఫలం అంటే ఆయుర్వేదంలో మూడు పండ్ల కలయికతో తయారు చేస్తార. బిభితకి, అమలకి, హరితకి. ఈ మూడింటి పవర్‌ ఫుల్‌ కాంబినేషన్‌ లివర్‌ పనితీరును మెరుగు చేస్తుంది. ముఖ్యంగా త్రిఫల లివర్‌ను నేచురల్‌గా క్లెన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. త్రిఫలం తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. దీన్ని గోరువెచ్చని నీటిలో వేసుకుని తీసుకోవాలి.


ఇదీ చదవండి:  ఈ 4 సూపర్ ఫుడ్స్ తో మంచి నిద్ర.. గుండె ఆరోగ్యం.. మీ డైట్లో ఉన్నాయా?


వెల్లుల్లి..
వెల్లుల్లి మన వంటగదిలో నిత్యం అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎన్నో మెడిసినల్‌ గుణాలు ఉంటాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ స్టేట్‌ నివేదిక ప్రకారం వెల్లుల్లిలో అల్లిసిన్‌, సెలీనియం ఉంటాయి. ఇది కాలేయాన్ని క్లెన్స్‌ చేస్తుంది. కాలేయంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లి మంట సమస్యను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఫ్యాటీ లివర్‌ను తగ్గించేస్తాయి. మీరు వంటచేసుకునే ఆహార పదార్థాల్లో వెల్లుల్లి వేసుకుని తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి