Cholesterol Tips: కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..4 ఆయుర్వేద చిట్కాలతో 4 వారాల్లో మాయం
Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికమైతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికమౌతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే 4 ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికమైతే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికమౌతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే 4 ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బాడీ ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే సరైన మోతాదులో గుడ్ కొలెస్ట్రాల్ అవసరమౌతుంది. కానీ కొలెస్ట్రాల్ పరిమితి దాటితే అధిక రక్తపోటు, డయాబెటిస్, హార్ట్ ఎటాక్ ముప్పు అధికమౌతుంది. చెడు జీవనశైలి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య అధికంగా కన్పిస్తోంది. మీరు కూడా హై కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే..ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు 4 సులభమైన ఆయుర్వేద చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ధనియాతో అద్భుత లాభాలు
ధనియాలు లేకుండా ఏ భారతీయ వంట కూడా ఉండదంటే అతిశయోక్తి లేదు. ధనియాలను పౌడర్ చేసుకుని వినియోగిస్తుంటాం. అటు కొత్తిమీర వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. ధనియాలు బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చాలామందికి తెలియదు. ధనియాల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఫలితంగా బాడీ డీటాక్స్ ప్రక్రియ వేగవంతమౌతుంది. ఫలితంగా హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
శరీరంలో కఫం పెరిగినప్పుడు కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. ఫలితంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు ముందుగా కఫం నియంత్రించాలి. మసాలా, ఆయిలీ ఫుడ్స్ దూరంగా ఉంచాలి. ఆహారం బ్యాలెన్స్‌గా ఉంటే..కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
మెంతి గింజలను ఔషధంగా వినియోగిస్తారు. మెంతి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మెంతి గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మెంతి గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు యోగా లేదా వ్యాయామం చాలా అవసరం. మీ శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ప్రాణాయామం, శీర్షాసనం, మయూరాసనం వంటి ఆసనాలు వేయాలి. ఎక్కువ సేపు శ్వాస తీసుకునే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. హెర్బల్ ఉత్పత్తులతో కూడా అధిక ప్రయోజనాలుంటాయి.
Also read: Appetite Loss: ఆకలి తగ్గిపోతోందా, నీరసంగా ఉంటుందా..అయితే ఆ మినరల్ లోపం కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook