Appetite Loss: ఆకలి తగ్గిపోతోందా, నీరసంగా ఉంటుందా..అయితే ఆ మినరల్ లోపం కావచ్చు

Appetite Loss: కొంతమందికి ఆకలి వేయదు. ఎక్కువగా చిన్న పిల్లల్లో ఉంటుంది ఈ సమస్య. ఆకలి లేకపోవడానికి కారణాలు చాలానే ఉన్నా..ప్రత్యేకించి ఒక మినరల్ లోపం కూడా కారణమే. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 29, 2022, 10:15 PM IST
Appetite Loss: ఆకలి తగ్గిపోతోందా, నీరసంగా ఉంటుందా..అయితే ఆ మినరల్ లోపం కావచ్చు

Appetite Loss: కొంతమందికి ఆకలి వేయదు. ఎక్కువగా చిన్న పిల్లల్లో ఉంటుంది ఈ సమస్య. ఆకలి లేకపోవడానికి కారణాలు చాలానే ఉన్నా..ప్రత్యేకించి ఒక మినరల్ లోపం కూడా కారణమే. ఆ వివరాలు తెలుసుకుందాం..

చిన్న పిల్లల్లో లేదా ఓ వయస్సు దాటాక ఆకలి ఎక్కువగా వేయదు. ఫలితంగా ఎక్కువగా తినకపోవడం వల్ల ఆ ప్రభావం నేరుగా శరీరంపై పడుతుంది. దాంతో ఏ చిన్న పని చేసినా వెంటనే ఆలసిపోతుంటారు. బరువు కూడా గణనీయంగా తగ్గుతుంటుంది. ఈ పరిస్థితుల్లో తిరిగి కోలుకోకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. లేకుంటే క్రమంగా బలహీనపడిపోతారు. ఇలా ఆకలి తగ్గడానికి ప్రధాన కారణం జింక్ లోపమంటున్నారు వైద్య నిపుణులు..

జింక్ ఎందుకు అవసరం

జింక్ ఒక ప్రత్యేకమైన న్యూట్రియంట్. ఇది శరీరానికి చాలా అవసరం. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచేందుకు, చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచేందుకు దోహదపడుతుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆకలి లేమి నుంచి ఉపశమనం పొందాలంటే...జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి.

జింక్ లోపముంటే కన్పించే లక్షణాలు

ఆకలి లేమి, బరువు తగ్గడం, బలహీనత, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, డయేరియా, హెయిర్ ఫాల్, గాయాలు ఆలస్యంగా మానడం, రుచి, వ్యర్ధాలకు తేడా తెలియకపోవడం

జింక్ లోపాన్ని సరిజేసే ఆహారం

పెరుగు హెల్తీ డైట్ అని అందరికీ తెలుసు. పెరుగు వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. దాంతోపాటు శరీరంలో జింక్ కొరత దూరమౌతుంది. జీడిపప్పు ఆరోగ్యానికి చాలా బలవర్దకమైన ఆహారం. ఇందులో జింక్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ కే, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. తెల్ల శెనగల్లో కూడా జింక్ తగిన మోతాదులో ఉంటుంది. జింక్‌తో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తెల్ల శెనగలు తినడం శరీరంలో జింక్ లోపం పోతుంది. పుచ్చకాయ విత్తనాల్ని చాలామంది వృధా అనుకుని...పడేస్తుంటారు. కానీ ఇందులో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆకలి కూడా పెరుగుతుంది. 

Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News