Banana Flower: రక్తం కొరత వల్ల శరీరంలో రకరకాల మార్పులు వచ్చి వివిధ రకాల అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. అటువంటి పరిస్థితిలో సకాలంలో చికిత్స పొందాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు మరిత పెరుగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రక్తహీనత లోపం నుంచి విముక్తి పొందడానికి దానిమ్మ, బీట్‌రూట్ తినడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఈ సమస్య  కొందరికి మందుల సాహాయంతోనే తీరుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ సమస్య నుంచి సులభంగా విముక్తి పొందడానికి పలు రకాల ఆహారాలును తీసుకోవాలని తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అరటి పువ్వుతో లాభాలు:


అరటి పువ్వులో అనేక రకాల పోషకాలు విలువలున్నాయి. అంతేకాకుండా ఇందులో చాలా విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఉన్నాయి. దీని వల్ల రక్తహీనత, మధుమేహం, ఇన్ఫెక్షన్‌ను తొలగిపోతాయి. మహిళలకు పీరియడ్స్ టైమ్స్‌లో అధిక రక్తస్రావం నుంచి ఉపశమనం పొందవచ్చు.


అరటి పువ్వును ఎలా తినాలి:



చాలా మంది అరటి పువ్వును ఎలా తినాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ పువ్వులతో కషాయాలను తయారు చేసి త్రాగవచ్చు. దీని నుంచి శరీరానికి అనేక ప్రయోజనాలు  చేకూరుతాయి. దీని కోసం..మొదట అరటి పువ్వులను ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. దీని తరువాత.. చల్లబడిన తర్వాత, నల్ల మిరియాలు, అర టీస్పూన్ గ్రౌండ్ జీలకర్రను కూడా అందులో వేయాలి. ఇప్పుడు మళ్లీ వాటీని బాగా ఉడికించాలి. చల్లారిన తర్వాత పెరుగు కలుపుకుని తినవచ్చు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Mosquito Repellent: దోమల బెడద ఉందా..మీ ఇంటి చుట్టూ 5 రకాల మొక్కలను నాటండి..!!


Also Read: Coriander Seeds Water Benefits: కొత్తి మీర గింజలతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి