Banana Peel For Skin Whitening: మార్కెట్‌లో వివధ రకాల పండ్లు దొరుకుతాయి. ఇవి తినడానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యం పెంచడంలోను సహాయపడుతాయని చర్మ నిపుణులు అంటున్నారు. అరటి పండులో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి.  అరటి పండును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే కేవలం పండుతోనే కాకుండా ఆరటి తొక్క కూడా మనకు సహాయపడుతుంది. ఆరటి తొక్కలో కూడా అధికంగా పోషకాలు లభిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో అర‌టి తొక్క ఎంతో మేలు చేస్తుంది. చ‌ర్మంపై వచ్చే మొటిమలను, ముడ‌త‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను తొల‌గించ‌డంలో అర‌టి తొక్క ఎంతో దోహ‌ద‌ప‌డుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు అరటి తొక్కను చర్మంపై ఎలా ఉపయోగించాలి అనే దానిపై తెలుసుకుందాం..


Also Read: Dhaniyala Kashayam Benefits: ఈ కషాయం తాగుతే చాలు.. అనాగోర్య సమస్యలకు చెక్‌ పెట్టినట్టే !



తాజా అరటి పండు తొక్కను తీసుకోవాలి. దీనికి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను ముఖ్మం మీద మసాజ్ చేసుకోవాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజు ఇలా చేయడం వల్ల మచ్చలు, ముడతలు వంటి సమస్యలు తగ్గుతాయి.  మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అర‌టి తొక్క‌ను ప‌డుకునే ముందు ముఖానికి రుద్దుకుని ఉద‌యాన్నే క‌డిగి వేయడం వల్ల సమస్య కొంతలో కొంత తగ్గుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా అర‌టి తొక్క మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.


 


Also Read: Mustard Seeds Water: మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఈ టీని తాగండి..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి