Dhaniyala Kashayam: కషాయం తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడారు. దీని కారణంగా చేదుగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ కషాయం చేసే మేలు మరి ఏ టాబ్లెట్‌తోను పొందలేమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే కషాయం తయారు చేసుకోవాలి అంటే కష్టపడే అవసరం లేదు, అందుబాటులో ఉండే పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. కషాయంలో బాగా చేసుకొనే ధనియాల కషాయం గురించి తెలుసుకుందాం. దీనివల్ల పొందే ఉపయోగాలు ఎంతో ఇక్కడ తెలుసుకుందాం..
ధనియాల కషాయం తాగడం వల్ల ఎన్నో లభాలు పొందవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు, నరాల బలహీనత వంటి సమస్యలన్నింటిని తగ్గిస్తుంది. అరికాళ్లల్లో, అరి చేతులు మంటలు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ పదార్థం మనకు సహాయపడుతుంది.
ధనియాల ఔషధ గుణాలు ...
ధనియాలను సరైన పద్ధతిలో ఉపయోగించడం కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. ధనియాలతో కషాయాన్ని తయారు చేసుకోవడం ఎలా? ఒక గిన్నెలో గ్లాస్ నీటిని పోసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఈ నీటిని 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఈ నీటిని వడకట్టి టీ తాగినట్టు తాగాలి. ఈవిధంగా ధనియాల కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
ధనియాల్లో అధిక మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ధనియాలతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. క్యాల్షియం పొందడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ధనియాల కషాయాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Tips For Prevent Piles: పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా..? సింపుల్ టిప్స్‌తో ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి