Banana Peel Tea Benefits In Telugu: ప్రతిరోజు అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే చాలామంది ఈ పండ్లను తినే క్రమంలో దానిపై తొక్కని తీసి లోపలి పండ్లు తింటూ ఉంటారు. నిజానికి పండు కంటే తొక్కలోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తొక్కలో ఉండే పోషకాలు శరీరానికి అనేక రకాలుగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. అరటి పండ్ల తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టీ లాగా తయారు చేసుకునే తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ టీని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో అరటి పండ్ల తొక్కలతో టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటిపండ్ల తొక్కల టీ తయారీ విధానం:
ముందుగా అరటి పండ్ల తొక్కలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పై చిన్న బౌల్ పెట్టుకొని అందులో కప్పు నీటిని పోసుకొని ఈ తొక్కలను అందులో వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఇందులోనే తగినంత దాల్చిన చెక్కను వేసుకొని పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుని తేనె మిక్స్ చేసుకొని తాగితే, రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం.


అరటి తొక్కలో ఉండే పోషకాలు:
అరటి తొక్కలో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటుంది. దీంతోపాటు ఇందులో విటమిన్ b6, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ కూడా లభిస్తాయి. ఇవే కాకుండా ఇందులో ఉండే విటమిన్ b6 శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు కణాలను అభివృద్ధి చేయడానికి కూడా దోహదపడుతుంది.


ఈ టీ ని తాగడం వల్ల కలిగే లాభాలు..
అధిక మోతాదులో పొటాషియం:

ఇందులో శరీరానికి కావలసిన పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి కండరాల నొప్పులను తగ్గించడానికి శరీర ఒత్తిడిని నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతే కాకుండా అధిక సోడియం వల్ల కలిగే ఉబ్బరాన్ని సమతుల్యం చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే గుణాలు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


నిద్రలేమి సమస్యలకు చెక్:
అరటి తొక్క నీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం నిద్ర నాణ్యతను పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా వేగంగా నిద్రపోయేందుకు సరిపోయే హార్మోన్స్‌ను అందించేందుకు కూడా దోహదపడతాయి. కాబట్టి నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ట్రై చేయండి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి