Naveen Chandra: గేమ్ ఛేంజర్ సినిమాకి చిట్టీలు వేశారు.. రామ్ చరణ్ టీమ్ పై షాకింగ్ కామెంట్స్..!

Game Changer Cast: రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ ఛేంజర్.. సినిమా ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో భాగమైన నవీన్ చంద్ర ఈ చిత్రం గురించి ప్రస్తుతం చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా రామ్ చరణ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 21, 2024, 01:47 PM IST
Naveen Chandra: గేమ్ ఛేంజర్ సినిమాకి చిట్టీలు వేశారు.. రామ్ చరణ్ టీమ్ పై షాకింగ్ కామెంట్స్..!

Game Changer Update: ప్రముఖ హీరో నవీన్ చంద్ర, రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తన పాత్ర గురించి , శంకర్ మేకింగ్ గురించి, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి స్పందించారు నవీన్ చంద్ర. 

ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ వంటి వారితో పని చేసే అవకాశం లభించడంతో ఎంతో సంతోషం కలిగింది అంటూ తెలిపారు. తనకు దిల్ రాజు మెంటర్ గా , లక్కీ హ్యాండ్ గా మారిపోయాడని , అందాల రాక్షసి సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారని , మళ్లీ తనను పిలిచి నేను లోకల్ సినిమాలో అవకాశం ఇచ్చారని, ఇది తనకు రీయంట్రీలా ఉపయోగపడింది అంటూ దిల్ రాజు గురించి కూడా చెప్పుకొచ్చారు. 

సాధారణంగా ప్రతి పాత్రకు ఆర్టిస్టుల పేర్లు చిట్టీల ద్వారా మెజారిటీ ఓటింగ్ ద్వారానే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విషయం అసిస్టెంట్ డైరెక్టర్ భరత్ ద్వారానే నాకు తెలిసింది.  నేను ఈ సినిమాలో ఎంపికయ్యానని.. అయితే ఇందులో నా కథ ఏంటి?పాత్ర ఏంటి? అని ఏం తెలియకుండానే మొదటి రోజు సెట్స్ కి వెళ్ళిపోయాను. డైలాగ్ చెప్పాను. అయితే ముందుగా..కథ నా పాత్ర గురించి తెలియకుండా ఎలా నటించాలి అని అడిగితే శంకర్ అన్ని వివరించి, ప్రతి సీను నటించి మరీ చూపించారు అంటూ తెలిపారు నవీన్ చంద్ర. 

శంకర్ తనకు ప్రతి విషయంలో కూడా సహాయపడ్డారని, నేను ఎలా నటించాలో నాకు ఆయన చేసి చూపించడం వల్లే నటన మరింత సులువు అయింది అని తెలిపారు. రాంచరణ్ తో కాంబో సీన్లు కూడా ఉంటాయని, పొలిటికల్ డ్రామా అదిరిపోయిందని,  ప్రతి సీన్ ప్రతి రియాక్షన్ అన్నింటినీ శంకర్ దగ్గరుండి మరీ చూసుకునేవాడని నవీన్ చంద్ర తెలిపారు. 

అంతేకాదు ప్రతి ఒక్కరి మీద శంకర్ కమాండింగ్ ఉంటుందని, ఎవరు ఏ పని చేస్తున్నారో ఆయనకు ఇట్టే తెలిసిపోయేదని కూడా తెలిపారు నవీన్ చంద్ర. మొత్తానికి అయితే సినిమాపై హైప్ పెంచేసి..భారీ అంచనాలను క్రియేట్ చేశారు నవీన్ చంద్ర.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x