Sanitizer: పదే పదే శానిటైజర్ వాడొద్దు.. ఎందుకో తెలుసా?
డాక్టర్లు, వైద్య నిపుణులు సలహా ఇచ్చారని శానిటైజర్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత ఉపయోగించకూడదు. ఇంకా చెప్పాలంటే పదే పదే శానిటైజర్ వాడకం వల్ల అనర్థాలు (DisAdvantages of Sanitizer)కూడా ఉన్నాయి.
కరోనా వైరస్ (CoronaVirus) భయంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు చేతుల్ని శానిటైజర్ (Hand Sanitizer)తో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా భయంతో ఉన్నవారు పదే పదే శానిటైజర్ వాడకాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే శానిటైజర్‌ను మరీ అధికంగా వాడితే నష్టాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. COVID19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా శుభవార్త
శానిటైజర్ ఎక్కువగా వాడితే నష్టాలు (Demerits Of Sanitizer):
- ఇంట్లో ఉన్న సమయంలో చాలా తక్కువ పర్యాయాలు శానిటైజర్లను వాడకం మంచిదని చెబుతున్నారు. పదే పదే శానిటైజర్‌ను వాడితే అరచేతుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది.
- వాస్తవానికి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని రకాల మంచి బ్యాక్టీరియాలు దోహదం చేస్తాయి. కావున శానిటైజర్‌ను అవసరం మేరకే వాడాలి కానీ అలవాటుగా వాడకూడదు.
- శానిటైజర్లకు మరీ ఎక్కువగా అలవాటు పడితే, వైరస్, క్రిములు తమ రోగ నిరోధకశక్తిని పెంచుకునే అవకాశాలున్నాయి. మన శరీరానికి, చేతులకు సహజ సిద్ధంగా ఉండే రోగ నిరోధకశక్తి స్థాయి తగ్గే అవకాశం ఉంది. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
- కొందరు దగ్గినా, తుమ్మినా శానిటైజర్ ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదు. చేతులు అపరిశుభ్రంగా, దుమ్ము, మట్టి అంటుకున్నప్పుడు వాడటం శ్రేయస్కరం.
- ఇంట్లో ఉన్నప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం బెటర్. 20 సెకన్లపాటు చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవడం వల్ల క్రిముల బారిన పడకుండా ఉంటామని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అభిప్రాయపడింది. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్