Bed Tea Side Effects: భారత్‌లో చాలా మంది టీ ప్రియులున్నారు. ముఖ్యంగా ఉదయం ప్రతి ఇళ్లు టీతోనే మొదలవుతుంది. దీనిలో ఉండే గుణాలు మైండ్‌కు చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది. శరీరాన్ని ఒత్తిడిని నుంచి తొలగించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిని మధ్యాహ్నం పూట తాగితే అద్భుతమైన తాజాదనాన్ని ఇవ్వడంతోపాటు అలసట దూరం చేస్తుంది. అయితే దీనిని కొన్ని సందర్భాల్లో తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా మంది ఖాళీ కడుపుతో టీ తాగుతారు:


కొందరికి ఉదయం లేవగానే టీ తాగే చెడు అలవాటు ఉంటుంది. దీనిని 'బెడ్ టీ' అని కూడా పిలుస్తారు. ఈ టీ తాగకుండా వారు రోజు పనిని సరిగ్గా చేయలేరు. అంతేకాకుండా ఆఫీసులో ఉదయాన్నే షిఫ్ట్ చేసే వ్యక్తులు టీ లేకుండా అస్సలు పని చేయలేరు.


'బెడ్ టీ' ఆరోగ్యానికి మంచిది కాదు:


ఉదయాన్నే టీ తాగడం అనే అభిరుచి మనసుకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. కానీ అది ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


'టీ' తాగడం వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు:


1. బెడ్ టీ తాగడం వల్ల వచ్చే అతి పెద్ద సమస్యలు ఎసిడిటీ, మలబద్ధకం.


2. ఉదయాన్నే టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు దెబ్బతింటుంది.


3. అతిగా టీ తాగితే నిద్ర సరిగ్గా పట్టదు.


4. ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగడం వల్ల బరువు వేగంగా పెరుగే అవకాశాలున్నాయి.


5. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అల్సర్ సమస్య వస్తాయి. అలాగే ప్రొటీన్ లోపం వచ్చే ప్రమాదం ఉంది.


6. బెడ్ టీ తాగడం వల్ల నరాల సంబంధిత సమస్యలు వస్తాయి.


7. టీలో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉన్నందున ఇది రక్తపోటుకు దారి తీసే అవకాశాలున్నాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: White Hair Problem: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!


Also Read: White Hair Problem: తరచుగా జుట్టు తెల్లబడుతుందా..ఈ చిట్కాలు పాటించండి..!!



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook