White Hair Problem: తరచుగా జుట్టు తెల్లబడుతుందా..ఈ చిట్కాలు పాటించండి..!!

White Hair Problem: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి. చిన్న వయసులోనే జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 03:50 PM IST
  • తరచుగా జుట్టు తెల్లబడుతుందా..
  • కరివేపాకు జుట్టును నల్లగా చేస్తుంది
  • జుట్టుకు కాఫీ రాయడం వల్ల నల్లగా మారుతుంది
White Hair Problem: తరచుగా జుట్టు తెల్లబడుతుందా..ఈ చిట్కాలు పాటించండి..!!

White Hair Problem: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి. చిన్న వయసులోనే జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోవడమే కాకుండా చాలా రకాల సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి. అటువంటి సందర్భంలో ఇంటి చిట్కాలను వినియోగించి తెల్ల జుట్టు సమస్యను సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.  కాబట్టి కాఫీ, కలబంద, కరివేపాకుతో జుట్టును నల్లగా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

కరివేపాకు జుట్టును నల్లగా చేస్తుంది:

కరివేపాకులో ఉండే గుణాలు తెల్లజుట్టు సులభంగా నల్ల జుట్టుగా మారుస్తుంది. ఇందుకోసం కొన్ని కరివేపాకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో రెండు, మూడు చెంచాల ఉసిరి పొడి, బ్రహ్మీ పౌడర్ కలపి పేస్ట్ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని జుట్టు మూలాల నుంచి మొత్తం అప్లై చేయండి. ఈ రెమెడీ జుట్టును నల్లగా చేయడమే కాకుండా..దృఢంగా మార్చుతుంది.

కలబందతో జుట్టు కూడా నల్లబడుతుంది:

కలబందతో జుట్టు కూడా నల్లబడుతుంది. ఇందుకోసం కలబంద మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేయాలి.

జుట్టుకు కాఫీ రాయడం వల్ల నల్లగా మారుతుంది:

కాఫీ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లబడుతుంది. కాఫీలో హెన్నాకలుపుకుని ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు నల్లగా మారుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Curd And Lemon Benefits: పెరుగు, నిమ్మకాయ మిశ్రమం వల్ల ముఖానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Also Read: Weight loss Tips: బరువు తగ్గలనుకుంటున్నారా..రాత్రి పూట ఈ పనులు చేయండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News