Beetroot Benefits: రోజు బీట్‌రూట్ తినడం వల్ల బోర్ కొడుతుందా? ఇలా చేయండి..ఆరోగ్యంతో పాటు రుచి మీ సొంతం!
Beetroot Benefits: బీట్‌రూట్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Beetroot Benefits: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు పోషకాలు కలిగిన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆరోగ్య నిపుణులు తరచుగా సమతుల్య ఆహారాలు తీసుకోవాలని సూచిస్తారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పండ్లతో పాటు కొన్ని అధిక పరిమాణంలో పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు తప్పనిసరిగా బీట్‌రూట్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు. అయితే ప్రతి రోజు బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల బోరింగ్‌గా అనిపించవచ్చు. ఇలాంటి వారి కోసం మేము కొన్ని రెసిపీలను తెలపబోతున్నాం. అయితే ఆ రెసిపీలేంటో వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ సలాడ్:
శరీర ప్రయోజనాలు పొందడానికి బీట్‌రూట్‌ను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సలాడ్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా బచ్చలికూరను కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక బౌల్ తీసుకుని అందులోనే చీజ్, వాల్‌నట్‌లు, కట్ చేసిన బచ్చలికూర వేసి బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
బీట్‌రూట్ స్మూతీ:
ఈ బీట్‌రూట్ స్మూతీ కూడా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి ముందుగా బీట్‌రూట్‌పై పొట్టు తీసి కట్ చేసుకోవాలి. మీక్సీలో గిన్నెలో ఈ ముక్కలను వేసి బెర్రీలు, అరటిపండు, పెరుగు వేసి స్మూతీలాగా తయారు చేసుకోవాలి.
బీట్‌రూట్ చిప్స్:
బీట్‌రూట్ చిప్స్‌లో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ఈ చిప్స్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా బీట్‌రూట్‌ను సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులోనే ఆలివ్ నూనె, ఉప్పు, నల్ల మిరియాలు, కారం కలిపి ఓవెన్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. బీట్‌రూట్ నుంచి పచ్చిపోయి చిప్స్‌లా తయారయ్యాక సర్వ్ చేసుకుని తినొచ్చు.
బీట్‌రూట్ ప్రయోజనాలు:
బీట్‌రూట్‌లో ఉండే గుణాలు రక్తపోటును సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా గుండెపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బీట్‌రూట్‌లో డైటరీ నైట్రేట్ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా అవయవాల పనితీరును మెరుగుపర్చుతుంది.
ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. దీని కారణంగా ఊబకాయం, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది.
క్యాన్సర్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బీట్‌రూట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్‌లు రక్తనాళాల విస్తరణను కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..