Belly Fat Lose Tips: అధికంగా కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టు కొవ్వు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా అధికమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌ లభించే వివిధ రకాల ఉత్పత్తులను వాడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఈ నియమాలు పాటించండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొట్ట చుట్టూ కొవ్వును నియంత్రించుకునేందుకు ఈ నియమాలు తప్పని సరి:


1. చక్కెరతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండండి:


చక్కెరతో తయారు చేసిన చేసిన పదార్థాలను తరుచుగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగే అవకాశాలు అధికమని నిపుణులు తెలుపుతున్నారు. దీని తర్వాత అది శరీర కొవ్వుపై ప్రభావవం పడే అవకాశాలు కూడా అధికమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొవ్వు కూడా పెరిగే అవకాశాలు కూడా అధికం.


2. ప్రోటీన్స్‌  పుష్కలంగా తినండి:


 ప్రతి రోజు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ ద్వారా 80-100% కేలరీలను పొందవచ్చు. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొవ్వును కూడా నియంత్రించుకోవచ్చు.


3. ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవద్దు:


సోయాబీన్ నూనె, కల్తీ వెన్న తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం కూడా పెరుగుతుంది. దీని వల్ల వివిధ రకాల వ్యాధులు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. బరువు తగ్గే క్రమంలో అస్సలు ఇలాంటి ఫుడ్‌ తీసుకోవద్దు.


4. శుద్ధి చేసిన పిండి:


పాస్తా వంటి ఆహార పదార్థాల్లోని పిండి ఉత్పత్తులలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.


5. వ్యాయామం తప్పని సరి:


శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయామమే ఉత్తమ మార్గమని నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తే.. పొట్టలో పేరుకుపోయిన కొవ్వు నియంత్రణలో ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!


Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook