Health Benefits of Kiwi Fruit : మన దేశంలో అంతగా సాగు చేయరు కానీ కివి పండు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీని ధర యాపిల్‌తో సమానంగా కొన్ని ప్రాంతాల్లో అంతకుమించి సైతం ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్లలో చిన్న పట్టణాలలో సైతం సూపర్ మార్కెట్లలో కివి పండు లభ్యమవుతుంది. కివి పండులో విటమిన్లు, పోషలకాలు మెండుగా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చల్లని ప్రదేశాలలో కివిని అధికంగా సాగు చేస్తారు. సపోటా పండులా, కోడిగడ్డు(Health Benefits of Egg) తరహాలో కనిపించే కివి పండులో విటమిన్ E మరియు విటమిన్ C లభిస్తాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం, పోలిక్ యాసిడ్, పీచు పదార్ధాలు కివి పండు తిన్నా, లేక జూస్ రూపంలో తీసుకున్నా మన శరీరానికి మెండుగా లభిస్తాయి.


Also Read Home Remedies: మీ Teeth తెల్లగా మారాలంటే ఈ 5 ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు
కివి పండు తిన్నా, జూస్ తాగినా కలిగే ప్రయోజనాలు (Benefits Of Kiwi Fruit)
- కివి జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి శరీరాన్ని, ఉదరాన్ని సమతౌల్యం చేస్తుంది. దీంతో ఆహారం వేళకు జీర్ణమవుతుంది. 


- కివిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వేసవికాలంలో రోగనిరోధక శక్తి కోసం కివి పండ్లను తినాలి.


- నిద్రకు సంబంధించిన సమస్యలు తీర్చడంలో కివిని ఉపయోగిస్తారని పలు అధ్యయనాలలో తేలింది. ఇందులో ఫైబర్ నిద్రలేమి సమస్యలను దూరం చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. 


Also Read: Benefits of Drinking Milk: పాలు తాగితే మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సహా పలు సమస్యలు దూరం అవుతాయి


- కివి పండ్ల తొక్కలో లుయిటిన్ పదార్ధం ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు చేయడంతో తోడ్పడుతుంది. 


-  కివి పండులో కొవ్వు, సల్ఫర్ తక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్ల షుగర్ పేషెంట్లు(Diabetes), గుండె సంబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు సైతం కివి పండు తినడం, జూస్ తాగడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 


- రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. కివి తీసుకునే వారిలో రక్తనాళాల్లో గట్టి పదార్ధం ఏర్పడకుండా చేస్తుంది. తద్వారా గుండెకు రక్తం బాగా సరఫరా అవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. గుండెపోటు లాంటివి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.


Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే  


-  కొన్ని రకాల క్యాన్సర్ కణాలను కివి చంపుతుంది. క్యాన్సర్ వ్యాధికి దారితీసే కొన్ని జన్యు పదార్థాలను నిరోధిస్తుందని కొన్ని ఆరోగ్య నివేదికలో తేలింది.


గమనిక: మీరు ఈ ఆరోగ్య చిట్కాలు పాటించాలని భావిస్తు ముందుగా వైద్యుడ్ని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీరు ఆరోగ్య చిట్కాలు పాటిస్తే ఏ ఆరోగ్య సమస్య, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook