Weight Loss Tips: నేలపైన పడుకోవడం వల్ల బోలెడన్ని లాభాలు .. తెలిస్తే షాక్!
Sleeping On The Floor: ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి చాలామంది బెడ్స్ పైనే పడుకోవడం ఇష్టపడుతుంటారు అయితే దీనికి బదులుగా నేల మీద పడుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెడ్స్ పై పడుకునే వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అదే విధంగా…..నేలపై పడుకునే వారికి ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Benefits of Sleeping on The Floor:
ఒకప్పుడు మనుషులందరూ నేలపైనే పడుకునేవారు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి ఈ అలవాటు కూడా మారింది. దానికి తోడు రకరకాల బెడ్స్ రావడం కూడా మొదలయ్యాయి. అయితే నేలపైన పడుకోవడమే శ్రేయస్కరమని దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లాభాలు ఏవో ఒకసారి.
నేల మీద పడుకోవడం వలన వెన్నెముక చక్కగా ఉంచడంలో తోడ్పడుతుంది.వెన్ను నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది .నేలపై పడుకోవడం వల్ల ముఖ్యంగా రక్త ప్రసరణ బాగా జరిగి మనల్ని చక్కగా నిద్రపోవడానికి తోత్పడుతుంది.
నేలపై పడుకోవడం వల్ల శరీర బరువు సమానంగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా శరీరం బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే నేలపైన పడుకోవడం వల్ల బరువు కూడా కొంచెం తగ్గుతామని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా ఒత్తిడి అసౌకర్యం ఇలాంటివి దూరమవుతాయి.
మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్లోకి వస్తుంది ఎందుకంటే బెడ్ అనేది వేడిగా ఉంటుంది అది నేల మీద పడుకోవడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది.
అయితే నేల మీద పడుకోవడం వల్ల లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే నేల మీద పురుగులు దుమ్ము అలర్జీ ఉన్న వాళ్ళకి కొంచెం నిద్ర సరిగ్గా ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు నేలను నీట్ గా క్లీన్ చేసుకోవడం వలన అలర్జీలు తగ్గుతాయి.అదేవిధంగా వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా మేరకు నేల మీద పడుకోవాల్సి ఉంటుంది.
Also Read: Kishan Reddy Letter: కేసీఆర్ పట్టించుకోలే మీరైనా సహకరించండి.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
Also read: Zinc Importance: శరీరంలో జింక్ అవసరమేంటి, లోపముంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook