Tamarind Leaves: చింతచిగురు ఔషధ విలువలు.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం…
Tamarind: మనం రోజు వండుకునే ఆహారంలోనే ఎన్నో ఔషధ విలువలు దాగి ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. అలా మనం ఉపయోగించే వాటిలో చింతచిగురు ఒకటి. చాలా మందికి చింతపండు గురించి తెలిసినంతగా చింతచిగురు గురించి తెలియదు. కానీ భారతీయ వంటల్లో ఎప్పటి నుంచో చింత చిగురును పచ్చడి దగ్గరనుంచి పులుసు వరకు ఎన్నో విధాలుగా వాడుతారు . చింత చిగురు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
Tamarind leaves: చింత చిగురు పచ్చడి దగ్గర నుంచి చాపల పులుసు వరకు విరివిగా ఉపయోగిస్తారు. చాలామందికి చింతపండు తెలుసుగాని చింతచిగురుని వండుకోవచ్చు అన్న విషయం తెలియదు.అలాంటి వాళ్ళు చింతచిగురు లో ఎన్ని బెనిఫిట్స్ దాగి ఉన్నాయో తెలిస్తే దీన్ని అస్సలు వదులుకోరు. వెజ్, నాన్ వెజ్ వంటల లో రుచి కోసం చింతచిగురుని వాడవచ్చు. చింతచిగురుని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో చింతచిగురు వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు దీన్ని ఉపయోగించడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింత చిగురు పప్పు ,రొయ్యల ఇగురు, చింత చిగురు పచ్చడి..వేడి వేడి అన్నంతో వీటిలో ఏదైనా కాంబినేషన్ తలచుకుంటే నోట్లో నీళ్లు ఊరుతుంది. మరి ఇంత టేస్టీ చింతచిగురు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి..
చింతచిగురులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మనలో రక్తహీనత సమస్యను అదుపులో పెడుతుంది. చిన్నపిల్లలకి చింత చిగురు పెట్టడం వల్ల మంచి బలం చేకూరుతుంది. కామెర్ల వ్యాధిని కూడా నయం చేసే గుణం చింత చిగురుకు ఉంది. కామెర్లతో బాధపడే వారికి చింతచిగురు రసం..పటిక బెల్లంతో కలిపి ఇస్తే మంచిది. చింతచిగురు ఆహారంలో తీసుకోవడం వల్ల వాతం వంటి లక్షణాలు తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
గొంతు నొప్పి ,ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు కూడా చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచెగురు క్రమం తప్పకుండా తీసుకునేవారికి కడుపులో నులిపురుగుల సమస్య కూడా తలెత్తదు.చింత చిగురును తినడం వల్ల రోదనిరోధక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింతచిగురు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.ఇందులో అధిక మోతాదులో లభించే ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనలు మేరకు సేకరించడం జరిగింది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు
Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి