Thati Bellam for  iron deficiency:  ప్రస్తుతం చాలా మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సమస్య బారిన పడుతున్నారు. ఐరన్‌ లోపం కారణంగా  శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, చ‌ర్మం పాలిపోయిన‌ట్టు ఉండ‌డం, జుట్టు రాల‌డం, ర‌క్త‌హీన‌త, డిఫ్రెష‌న్, త‌ల‌నొప్పి , గోర్లు పెలుసుగా మార‌డం వంటి స‌మ‌స్య‌లు కనిపిస్తాయి. దీనికోసం ఐర‌న్ ట్యాబ్లెట్స్ ను ఉప‌యోగిస్తారు. ఈ మందుల వ‌ల్లే కాకుండా మనం ప్రతిరోజు తీసుకొనే ఆహారంతో కూడా ఐరన్‌ శరీరానికి లభిస్తుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాటి బెల్లంలో ఐరన్‌ అధికంగా లభిస్తుంది. ఇందులో అనేక విటమిన్లు కూడా దాగి ఉన్నాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ లెవల్స్‌ పెంచుతుంది. దీని వల్ల రక్త హీనత సమస్య నుంచి బయటపడవచ్చు.  ఆరోగ్య నిపుణుల ప్రకారం సాధార‌ణంగా పురుషులకు రోజుకు ఐరన్‌ అనేది 10 మిల్లీ గ్రాములు, స్త్రీల‌కు రోజుకు 29 మిల్లీ గ్రాములు, గ‌ర్భిణీ స్త్రీల‌కు రోజుకు 27 మిల్లీ గ్రాములు, బాలింత‌ల‌కు రోజుకు 23 మిల్లీ గ్రాముల ఐర‌న్ లెవల్స్‌ ఉండాలి.


అంతేకాకుండా తాటి బెల్లం వల్ల పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. 
తాటి బెల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


తాటి బెల్లం లో ఫైబర్ల ఎక్కువగా ఉంటుంది.దీని కారణంగా  మలబద్ధకం, అజీర్తి సమస్యలకు సహాయపడుతుంది. 


Also read: Ayurvedic Remedy for Sore Throat: గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడాని చక్కటి చిట్కా!


శరీరంలో హానికర టాక్సిన్స్ ను బయటకి పంపిచడంలో తాటి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది.


తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ సమస్య మన దరికి రాకుండా చేస్తుంది.


తాటి బెల్లం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నివారింపబడుతుంది. 


తాటి బెల్లం ద్వారా  లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also read: Ganji Benefits: రోజు క్రమం తప్పకుండా గంజి…కరోనాకి సైతం ఉపయోగపడే డైట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter