Ganji Benefits:ప్రస్తుతం హడావిడి జీవనశైలి.. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా తినే భోజనాన్ని కూడా ఎలక్ట్రిక్ కుక్కర్లో వండడం ఫ్యాషన్ అయిపోయింది. ఉద్యోగ రీత్యా రోజు పరుగులు పెట్టే వారికి ఇది సులభమైన మార్గం కావడంతో ఎక్కువ శాతం అన్నాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్స్ లో వండుతున్నారు. గంజి వార్చడం.. గంజి అన్నం తినడం ఎప్పుడో మానేశారు. ఇంకా ఎక్కడో కొన్ని ప్రాంతాలలో ఈ అలవాటు అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఆయుర్వేదం ప్రకారం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కేజీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
మనం రోజు అన్నం పండుకునే పద్ధతులలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడంతో గంజి దొరకడమే చాలా కష్టంగా మారిపోయింది. అన్నం వార్చక వచ్చే గంజిలో , క్యాల్షియం, జింక్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. సహజమైన ఫైబర్ని శరీరానికి అందించడంలో గంజి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు వ్యాయామాలు చేసేవారు అది పనిగా ప్రోటీన్ షేక్ తాగుతారు కదా.. అంత ఖరీదు పెట్టి అది కొనుక్కొని తాగే బదులు ఒక గ్లాసు గెంజి తాగిన సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వలేని ప్రోటీన్ ను ఒక గ్లాసు గెంజి మీకు సహజమైన పద్ధతిలో అందిస్తుంది.
గంజి తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నియంత్రణ లోకి వస్తుంది. గంజిలో అధికమాతాధిలో లభించే ఫైటో కెమికల్స్, మెగ్నీషియం, పోటాషియం వంటి గుణాల కారణంగా బీపీ కంట్రోల్ లో ఉంటుంది. వాంతులు, విరోచనాలు అవుతుంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బజారులో దొరికే వారి ఓఆర్ఎస్ జ్యూసులు తీసుకొని వస్తాము. అయితే వీటిలో అధిక శాతంలో చక్కెర నిల్వలు ఉంటాయి కాబట్టి శరీరానికి అంత మంచిది కాదు. వీటి బదులు కాస్త పలుచట గంజి అంత ఊప్పు కలిపి తాగిస్తే సరిపోతుంది. శరీరంలో కోల్పోయిన పోషకాలని అందించడంతోపాటు.. శక్తిని కూడా అందించడంలో గంజి సహాయపడుతుంది. ఇందులో సహజమైన ప్రోబయాటిక్ తత్వం ఉంటుంది కాబట్టి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూసుకుంటుంది. పైగా ఈ రోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. మరి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇచ్చే గంజిని మీ రోజువారి డైట్ లో భాగంగా చేసుకోండి.
అంతేకాదు ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న ఈ సమయంలో ఇలా రోజు గంజి తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పెరిగి.. మన ఆరోగ్యాన్నికి రక్షణగా నిలబడుతుంది. మరింకెందుకు ఆలస్యం .. రోజు గంజిని ట్రై చేసేయండి.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook