Cholesterol Remedies: ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది. మనం తీసుకునే ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ శరీరంలో రక్తపోటు, గుండె వ్యాధులు ఎదురౌతుంటాయి. అయితే కొలెస్ట్రాల్ నియంత్రించడం లేదా నిర్మూలించడం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ప్రకృతిలో విరివిగా లభించే కొన్ని మూలికలతో ఈ సమస్యను అద్భుతంగా పరిష్కరించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చికిత్స ఉంది. ప్రకృతిలో లభించే పలు మూలికలతో కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు వంటి గంభీరమైన సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ మూలికలు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ సమస్యకు మందులు వాడకుండా ఆయుర్వేద మూలికలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం 7 రకాల మూలికలు కొలెస్ట్రాల్ నియంత్రణలో అద్భుతంగా దోహదం చేస్తాయి. 


త్రిఫల చూర్ణం. ఇది వాస్తవానికి మూడు మూలికల మిశ్రమం. రక్తంలో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. త్రిఫల చూర్ణాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని రోజూ పరగడుపున తాగవచ్చు. ఇందులో హరితకి, బిభీతకీ, అమలకీ అనే మూలికలుంటాయి.


ఇక రెండవది ప్రతి కిచెన్‌లో తప్పకుండా ఉండేది వెల్లుల్లి. ఇందులో ఉండే ఎలిసిన్ అనే రసాయనం తిన్న ఆహారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజుకు 1-2 వెల్లుల్లి రెమ్మల్ని పరగడుపున తింటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. ఇక మూడవది మెంతులు. ఇది కూడా ప్రతి వంటింట్లో తప్పకుండా ఉంటుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెంతుల్ని రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం తాగాలి. లేదా మెంతి పొడి నీళ్లలో కలుపుకుని తాగినా ఫరవాలేదు. 


అర్జున మూలిక కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను గణనీయంగా తగ్గించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అర్జున మూలిక చూర్ణాన్ని ఆహారంలో చేర్చుకోవడం లేదా నీటిలో కలిపి తాగడం చేయవచ్చు. గుగ్గిలంను ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తారు. కానీ ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో అనాదిగా వాడుకలో ఉన్నదే. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో అద్భుతంగా దోహదపడుతుంది. 


తులసి ఆకులు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యవంతంగా చేస్తాయి. రోజూ ఉదయం పరగడుపున తులసి ఆకులతో చేసిన టీ తాగితే మంచి ఫలితాలుంటాయి. ఇక హరితకీ అంటే కరక్కాయ అనేది శరీరంలో విష పదార్ధాలు తొలగించి డీటాక్స్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గిస్తుంది. 


Also read: Smartphone Usage: గంటల తరబడి బ్లూ స్క్రీన్స్ చూస్తే స్ట్రోక్ ముప్పుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.