Weight Loss Diet: ఈ ఫైబర్ ఆధారిత ఫుడ్స్‌తో 12 రోజుల్లో జీరో సైజ్ నడుము పొందొచ్చు.!
Foods For Weight Loss: శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి రోజూ ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
Best Foods For Weight Loss: మనం తీసుకునే ప్రతి ఆహారంలో ఫైబర్ తప్పకుండా ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అనేక వ్యాధులను నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కరిగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు కూడా తగ్గొచ్చు. అయితే ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చల విడిగా తినడం వల్ల శరీర బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడమేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద పేర్కోన్న ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు..
బరువు తగ్గడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు:
బచ్చలికూర:
బచ్చలికూరలో ఐరన్ మాత్రమే కాదు, పీచు పదార్ధాలు కూడా లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల సులభంగా బరువు తగ్గడమేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ, సి, కెలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. శరీరానికి కావాల్సిన మెగ్నీషియం కూడా ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారంలో తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.
బ్రోకలీ:
ఆరోగ్యానికి అద్భుతమైన కూరగాయలలో బ్రోకలీ ఒకటి. ఇందులో కూడా అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి సులభంగా బరువును తగ్గించి, కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా బ్రోకలీని ఆహారంలో తీసుకుంటే..శరీరానికి దాదాపు 31 కేలరీలు, 2.4 గ్రాముల ఫైబర్ లభిస్తాయి.
యాపిల్:
యాపిల్ పండ్లలో అధిక పరిమాణంలో పోషకాలతో పాటు ఫైబర్ లభిస్తుంది. కాబట్టి సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ అల్పాహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా బరువును తగ్గించడానికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..
ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook