Immunity Foods: కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రోగ నిరోధక శక్తి ప్రాముఖ్యత పెరిగినా..ఇతర ఏ అనారోగ్య సమస్యలకైనా మూలమదే. శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటే..ఏ రోగమూ దరిచేరదు. అందుకే ఇమ్యూనిటీని పంచే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి ఆరోగ్యానికి ఇమ్యూనిటీ చాలా అవసరం. ఇమ్యూనిటీ బాగుంటే ఏ రోగమూ దరిచేరదు. కేవలం కరోనా మహమ్మారి ఒక్కటే కాదు..ఏ అనారోగ్య సమస్యకైనా సరే ఇదే పరిష్కారం. అందుకే నిత్యం తినే ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. 


ప్రతిరోజూ తినే ఆహారంలో పోషక పదార్ధాలు మెండుగా ఉండేట్టు చూసుకోవాలి, ముఖ్యంగా విటమిన్ సి, జింక్ తప్పనిసరి. అందుకే నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తప్పనిసరిగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటి ఆక్సిడెంట్లతో పాటు మంచి పోషకాలుంటాయి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే ఏ రోగమూ దరిచేరదనేది వాస్తవం. మరో బలవర్ధకమైన ఆహారం, రోగ నిరోధక శక్తిని పెంచేవి రాగులు , ఓట్స్. ఇందులో ఫైబర్, విటమిన్ బి, సంక్లిష్ట పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు రోజూ ఒక గుడ్డు తప్పకుండా తినాల్సిందే. 


ఇక అన్నిరకాల పోషక పదార్ధాలు, బలమైన ఆహారంగా కిచిడీ చాలా మంచిది. ఇందులో ఉండే పప్పులు, అన్నం, కూరగాయలు, కాసింత గరం మసాలా రోగ నిరోధక శక్తిని అమాంతంగా పెంచుతుంది. బలమైన ఆహారంగానే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది కూడా. మరోవైపు ద్రవ పదార్ధాల విషయంలో...నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. హైడ్రేషన్ సమస్య తలెత్తదు. ముఖ్యంగా కొబ్బరి నీరు, నిమ్మరసం, హెర్బల్ టీ, ఓఆర్ఎస్ వంటివి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. 


ముఖ్యంగా జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ప్యాకేజ్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. ఎప్పుడూ ఇంట్లో చేసిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి. రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా పాలకూర, టమాట, బీట్ రూట్ వంటివి ఉండేట్టు చూసుకోవాలి. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్ వంటివి శరీరానికి బలాన్నిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మీ డైట్‌లో ఈ ఆహార పదార్ధాలు మిస్సవకుండా చూసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం అలవర్చుకుంటే చాలు..మెరుగైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది. 


Also read: Empty Stomache Foods: ఆ పదార్ధాల్ని పర గడుపున తింటే ప్రమాదకరమే, వెంటనే మానేయండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.