Best Fruit For Asthma: వాతావరణంలో కాలుష్యం పెరగడం వల్ల శ్వాస తీసుకునే క్రమంలో ఆక్సిజన్ తో పాటు పొగ కూడా శరీరం లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవడమే కాకుండా దెబ్బతింటున్నాయి. దీని కారణంగా ఆస్తమా వంటి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తులు పాడవడం వల్ల శరీరంలోని చాలా రకాల అవయవాలు కూడా చెడిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కిడ్నీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే దానిమ్మ పండ్లను ఉదయం పూట తప్పకుండా తినాలి. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తహీనతను తగ్గించి ఊపిరితిత్తులను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా తీవ్రవ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.


ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నారింజ పండ్లు కూడా సహాయపడతాయి. నారింజ పండ్లలో విటమిన్ సి, విటమిన్ b6 అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటికి పంపించేందుకు కీలకంగా సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో అలర్జీ, ఆస్తమా ను దూరం చేసే చాలా రకాల మూలకాలు లభిస్తాయి.


అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు వైద్యులను సంప్రదించినప్పుడు ప్రతి ఒక్క వైద్యుడు యాపిల్ పండును తినమని సూచిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ సి, విటమిన్ ఈ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించి ఊపిరితిత్తుల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.  ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు యాపిల్ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోండి.


Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?


Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook