Diabetic Patients: ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. కొద్దిగా జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే ప్రాణాంతకమైన డయాబెటిస్ కూడా తగ్గించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం..మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పదార్ధాలు చేర్చి చూడండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా..మధుమేహం పెను సమస్యగా మారుతోంది. మధుమేహం ఎంతటి ప్రమాదకరమైనా సరైన డైట్‌తో నియంత్రణ సాధ్యమేనంటున్నారు వైద్య నిపుణులు. దీనికోసం ముందుగా బ్రేక్‌ఫాస్ట్‌పై దృష్టి సారించాలి. ఎందుకంటే రోజు ప్రారంభమయ్యేది బ్రేక్‌ఫాస్ట్‌తోనే..ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయం వేళల్లో శరీరంలో ఇన్సులిన్ స్థాయి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ దీనికి నియంత్రిస్తుంది. అంటే ఆ రోజు మొత్తంలో బ్లడ్ షుగర్ స్థాయి..మీరు తీసుకునే తొలి డైట్ బ్రేక్‌ఫాస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..


రోస్టెడ్ వెజిటబుల్ ఎగ్ ఆమ్లెట్


చాలామంది ఇష్టంగా తినే ఎగ్ ఆమ్లెట్‌లో కొన్ని రకాల కూరగాయల్ని మిక్స్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల శరీరానికి పోషక పదార్ధాలతో పాటు ఫైబర్ కూడా అందుతుంది. ఆహారం వృధా కాదు. మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వెజిటబుల్ ఎగ్ ఆమ్లెట్ తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రోటీన్లు, లేదా అధిక ఫైబర్ ఉండేట్టు చూసుకోవాలి. 


ఓట్స్, బాదాం, చియా సీడ్స్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, తేనె..ఈ అన్నింటినీ ఒక బౌల్‌లో వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచాలి. ఉదయం అల్పాహారంగా ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ పదార్ధాలు డయాబెటిస్ రోగులకు అత్యంత సురక్షితం. 


Also read: Healthy Kidney: మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే..ఇవాళ్టి నుంచే ఇవి అలవాటు చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి