Healthy Foods For Heart: అసలు గుండె నొప్పి రాకుండా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే, ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తింటే గుండె ఆరోగ్యానికి మంచిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్ వెజిటబుల్స్ : 
పాలకూర, బ్రోకోలి, లీఫ్ క్యాబేజ్ వంటి గ్రీన్ వెజిటేబుల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి K విటమిన్ ఎంతో మేలు చేస్తుంది. పాలకూర, బ్రోకోలి, లీఫ్ క్యాబేజ్ వంటి ఆకు కూరల్లో విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది. 


అవోకాడోస్ : 
అవోకాడోస్ గుండె ఆరోగ్యానికి మంచిది. అవోకాడోలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించడంలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అవోకాడో తింటే కొలిస్ట్రాల్‌ని కొంతమేరకు కరిగించుకోవడం సులభం అవుతుంది.   


ఫ్యాటీ ఫిష్ :
సాల్మన్, మెకెరెల్, సార్డైన్స్, టునా వంటి ఫ్యాటీ ఫిష్ రకాలైన చేపల్లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అందుకే సాల్మన్, మెకెరెల్, సార్డైన్స్, టునా రకం చేపలు తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


వాల్‌నట్స్ :
వాల్‌నట్స్‌లో కూడా ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ , అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ డైలీ డైట్‌లో భాగం చేసుకున్నట్టయితే, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండె నొప్పి వంటి సమస్యలు నివారించవచ్చు. 


డార్క్ చాకోలెట్స్ :
డార్క్ చాకోలెట్స్‌లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ప్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగని చాకొలెట్స్ ని మోతాదుకు మించి తీసుకోవద్దు. అది కూడా ఆరోగ్యానికి హానికరమే అవుతుంది. ముఖ్యంగా చాక్లెట్స్ ని ఎక్కువగా తినడం వల్ల దంతాల్లో క్యావిటి వచ్చే ప్రమాదం ఉంటుంది.


టమాటలు :  
టమాటలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో శరీరానికి సహాయపడతాయి.  టమాటాల్లో లైకోపెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గుండెకు మేలు చేయడమే మాత్రమే కాకుండా క్యాన్సర్ నివారిణిగానూ పనిచేస్తుంది. ఈ లైకోపెన్ ని యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ గానూ పిలుస్తుంటారు. టమాటాలు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు వంటి పండ్లు, కూరగాయలకు ఆ రెడ్ కలర్ రావడానికి కూడా ఈ లైకోపెన్ కారణం.


ఇది కూడా చదవండి :  Eye Care: మీ కంటి చూపు పెరగాలంటే ఈ పదార్ధాలు డైట్‌లో ఉండాల్సిందే


గ్రీన్ టీ : 
గ్రీన్ టీ వల్ల గుండెకు మాత్రమే కాదు.. శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి. ఇది శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించడమే కాకుండా బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడం, అధిక బరువును తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


ఇది కూడా చదవండి : Dry Cough Remedies: ఈ రెండు వస్తువులు వాడితే చాలు పొడిదగ్గు చిటికెలో మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK