Eye Care: మీ కంటి చూపు పెరగాలంటే ఈ పదార్ధాలు డైట్‌లో ఉండాల్సిందే

Eye Care: మనిషి శరీరంలో అన్ని అంగాలకు సమాన ప్రాధాన్యత ఉన్నా..కొన్ని అంగాలు మాత్రం ప్రత్యేకమే. గుండె, కిడ్నీలు, లివర్ వంటివి ఎంత ముఖ్యమో..కళ్లు కూడా అంతే అవసరం. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రదానం అన్నారు పెద్దలు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 29, 2023, 12:23 AM IST
Eye Care: మీ కంటి చూపు పెరగాలంటే ఈ పదార్ధాలు డైట్‌లో ఉండాల్సిందే

Eye Care: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గుతుంటుంది. కానీ జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా తక్కువ వయస్సుకే కంటి చూపు మందగిస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. కంటి చూపు సమస్యను మెరుగుపర్చేందుకు 5 సులభమైన రెమిడీస్ ఉన్నాయి. వాటి గురించి వివరాలు ఇలా ఉన్నాయి..

మనిషి తన శరీరంలో గుండె, లివర్, కిడ్నీలకు ఎంతటి సంరక్షణ కల్పిస్తాడో అంతే సంరక్షణ కంటికి ఇవ్వాల్సి ఉంటుంది. మనిషి శరీరంలో కళ్లు అతి ముఖ్యమైన భాగం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో కూడా కంటి చూపు మెరుగుపర్చుకోవచ్చు. కంటి చూపు సరి చేసేందుకు ఆహార పదార్ధాలపై శ్రద్ధ పెట్టడమే కాకుండా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా కంటి చూపు మందగించేందుకు రెండు కారణాలుంటాయి. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేదైతే, రెండవది చెడు జీవనశైలి. చెడు జీవనశైలి అంటే మన అలవాట్లు. టీవీ దగ్గర్నించి చూడటం, తగిన వెలుతురు లేకుండా చదువుతుండటం, పోషక పదార్ధాలు లేని భోజనం తీసుకోవడం, స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారడం వంటివి ప్రధానమైనవి. ఈ పరిస్థితిని నివారించేందుకు కొన్ని పద్ధతులు పాటించాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినాల్సి ఉంటుంది.

కంటి ఆరోగ్యానికి ప్రధానంగా కావల్సింది ఫైబర్, విటమిన్లు. దీనికోసం బాదం, కిస్‌మిస్, అంజీరాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి..ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహర పదార్ధాలు తీసుకుంటే చాలా మంచిది. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే పదార్ధాల్లో క్యారెట్, బొప్పాయి, ఉసిరి, షిమ్లా మిర్చి, ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు డైట్‌లో భాగంగా చేసుకోవాలి. 

ఇక మరోవైపు ఉసిరి, త్రిఫలం అనేవి కంటికి చాలా మేలు చేకూరుస్తాయి. రోజూ ఒక కప్ప నీళ్లలో ఒక స్పూన్ ఉసిరి రసం లేదా ఉసిరి పౌడర్ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఉదయం వేళల్లో తేనెతో కలిపి కూడా ఉసిరి రసం తీసుకోవచ్చు. కంటి వెలుగు పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక కళ్లను రోజూకు కనీసం 2-3 సార్లు చల్లని నీళ్లతో కడుగుతుండాలి. ఉద్యోగ రీత్యా అధిక సమయం కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ పై గడిపేవారికి ఇది అవసరం. 

ఇక తినే ఆహారంలో వారానికి కనీసం 4-5 సార్లు ఆకు కూరలు ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా తోటకూర, పాలకూర, పొన్నగంటి కూర చాలా మంచిది. దీంతోపాటు క్యారెట్ మద్యమధ్యలో సలాడ్ రూపంలో తీంటుంటే కంటి చూపును పెంచే విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది.

Also read: Monsoon Health Tips: తరచుగా వానా కాలంలో ఫ్లూల బారిన పడుతున్నారా? ఈ 5 చిప్స్‌ పాటించండి చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News