Dry Cough Remedies: ఈ రెండు వస్తువులు వాడితే చాలు పొడిదగ్గు చిటికెలో మాయం

Dry Cough Remedies: వర్షాకాలం సమీపిస్తోంది. సీజన్ మారగానే జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతాయి. వర్షాల్లో తడవకపోయినా ఈ సమస్య తప్పదు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ముఖ్యంగా పొడి దగ్గు సమస్యకు నివారణ ఎలాగనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 28, 2023, 08:05 PM IST
Dry Cough Remedies: ఈ రెండు వస్తువులు వాడితే చాలు పొడిదగ్గు చిటికెలో మాయం

Dry Cough Remedies: మనిషి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గితే సీజన్ మారినప్పుడల్లా సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటు ఫ్లూ లక్షణాలు వేధిస్తుంటాయి. పొడిదగ్గు అనేది భరించలేని సమస్యగా మారుతుంది. పొడిదగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

పొడిదగ్గు అనేది ఓ తీవ్రమైన సమస్య. పూర్తి అసౌకర్యంగా ఉండటమే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. పొడి దగ్గు మొదలైతే అంత సులభంగా తగ్గదు. పొడిదగ్గు నుంచి విముక్తి పొందేందుకు హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలతో పొడి దగ్గు సమస్య నుంచి చాలా సులభంగా విముక్తి పొందవచ్చు. నల్ల మిరియాలు, తులసి సహాయంతో పొడిదగ్గును అద్భుతంగా తగ్గించుకోవచ్చు. నల్ల మిరియాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. తులసిలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఎలర్జిక్ గుణాల వల్ల ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. 

పొడి దగ్గు టానిక్ తయారీకు 10 నల్ల మిరియాలు, కొద్దిగా తులసి ఆకులు, 6 కప్పుల నీళ్లు అవసరమౌతాయి. పొడిదగ్గుకు అవసరమైన టానిక్ తయారీ కోసం ముందుగా ఓ ప్యాన్ తీసుకోవాలి. పది మిరియాలను పౌడర్‌గా చేసుకుని అందులో 6 కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే కొన్ని తులసి ఆకులు వేయాలి. ఓ గంటన్నర సేపు బాగా ఉడికించాలి. ఆ తరువాత ఓ కప్పులో వడకాచి పక్కన పెట్టుకోవాలి. రోజూ ఒక కప్పు కొద్దిగా వేడి చేసి తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల పొడిదగ్గు సులభంగా నియంత్రణలో ఉంటుంది.

Also read: Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ జ్యూస్ రోజూ తాగాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News