Kidney Disease Patients: కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఎలాంటి ఆహారం అయితే మేలు చేస్తుంది.. ఎలాంటి ఆహారం తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మరింత చెడిపోకుండా ఆరోగ్యంగా ఉంటారు అనే అంశంపై హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న సలహాలు, సూచనలపై ఓ స్మాల్ లుక్కేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్ట్రాబెర్రీస్ :
స్ట్రాబెర్రీస్ కేవలం టేస్ట్ లోనే కాదు.. ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ బ్రహ్మాండమైన ఆహార పదార్థం. స్ట్రాబెర్రీస్ పండ్లలో పొటాషియం తక్కువ మోతాదులో ఉండి, విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 


ఆలీవ్ ఆయిల్ :
ఆలీవ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో సహజంగా ఉండే పాలిఫినాల్స్, ఓలిక్ యాసిడ్ పొటలో మంట తగ్గించేలా యాంటి ఇన్‌ఫ్లామేటరీగా పనిచేస్తాయి.


రెడ్ గ్రేప్స్ :
రెడ్ గ్రేప్స్‌లో ఫ్లేవనాయిడ్స్ రక్తం చిక్కపడకుండా, గడ్డ కట్టకుండా ఉంచి శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తాయి. 


ఫిష్ :    
ప్రోటీన్ ఫుడ్ తినాలని అనుకునే వారికి చేప మాంసం రైట్ ఛాయిస్. ఎందుకంటే చేపలో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. చేప మాంసం గుండెకు కూడా చాలా మంచిది. ఎందుకంటే చేప మాంసంలో గుండెకు మేలు చేసే ఒమెగా 3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఉంటాయి. 


వెల్లుల్లి :
వెల్లుల్లితో కేవలం అద్భుతమైన రుచి మాత్రమే కాదు.. ఒంట్లో కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం కూడా ఉంటుంది. అంతేకాకుండా వెల్లుల్లి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగానూ పనిచేయడం విశేషం.


ఎగ్ వైట్ :
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ప్రొటీన్ ఫుడ్ కోసం ఎగ్ వైట్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పొటాషియం తక్కువ మోతాదులో ఉండి ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కేవలం ఎగ్ వైట్‌తో ఆమ్లెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.


బ్లూ బెర్రీస్ :
బ్లూ బెర్రీస్ పండ్లలో పొటాషియం తక్కువగా ఉండి యాంటీ ఆక్సిడంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. అంతేకాకుండా ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్‌గానూ పనిచేస్తుంది. 


కాలీఫ్లవర్ :
కాలీఫ్లవర్‌లో ఉండే విటమిన్ సి ఫోలేట్, ఫైబర్ మీ శరీరంలోని వ్యర్థాలను చేయిపెట్టి తీసేసినంత గొప్పగా పనిచేయగలవు. కాళీఫ్లవర్‌లో ఉన్న మరో గొప్పతనం ఏంటంటే.. దీనిని పచ్చిగానైనా తినొచ్చు లేదా ఉడకబెట్టుకుని తినడం లేదా సూప్ కూడా తాగొచ్చు.  


ఇది కూడా చదవండి : Health Problems: బాబోయ్.. విటమిన్ సి లేకపోతే ఇన్ని సమస్యలా ?


రెడ్ పెప్పర్స్ : 
ఎర్రటి మిరపకాయలు అంటే కేవలం కారం లాంటి కోసమే వంటల్లో యాడ్ చేసుకుంటారు అనే భావన ఉంది. కానీ ఇది కేవలం ఫ్లేవర్ కోసమే కాకుండా ఇందులోనూ పొటాషియం తక్కువ ఉండటంతో పాటు పోషక విలువలు కూడా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మళ్లీ ఇబ్బందులు తప్పవు.


క్యాబేజ్ : 
క్యాబేజ్ నిండా నీటి శాతంతో పాటు అధిక మోతాదులో ఫైబర్, పోషక విలువలు దాగి ఉంటాయి. అంతేకాకుండా ఒంటికి మేలు చేసే ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి.


ఇది కూడా చదవండి : Summer Health Problems: ఎండాకాలంలో ఎండవేడితో వచ్చే జబ్బులు


ఇది కూడా చదవండి : Tips For Bright Teeth: మెరిసే, శుభ్రమైన దంతాల కోసం ఇలా చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK