చలికాలంలో సహజంగా ఇమ్యూనిటీ క్షీణిస్తుంటుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం. నల్ల ఉప్పు, హీంగ్ రెండింట్లోనూ అద్బుతమైన ఔషధ గుణాలున్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురౌతాయి. దీనివల్ల కడుపులో డైజెస్టెవ్ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. అన్ని సమస్యలు దూరమౌతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడుపు నొప్పి దూరం


హీంగ్, నల్ల ఉప్పు కడుపు నొప్పిని దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ రెండింటినీ కలిపి నీళ్లతో తీసుకోవడం వల్ల  కడుపు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. కడుపు నొప్పిని దూరం చేసేందుకు హీంగ్, నల్ల ఉప్పును గోరు వెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవాలి. 


మెటబోలిజం వృద్ధి


హీంగ్, నల్ల ఉప్పులో ఉండే పోషకాలు మెటబోలిజంను పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. నీళ్లతో కలిపి హీంగ్, నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. జీర్ణ సంబంధ సమస్యలు కూడా దూరమౌతాయి.


అధిక బరువుకు చెక్


నల్ల ఉప్పు, హీంగ్ కలిపిన నీళ్లు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ నీళ్లను తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. ఈ రెండింటి నీళ్లతో కేలరీలు వేగంగా కరుగుతాయి. బరువు తగ్గడంలో దోహదమౌతుంది. దీనికోసం రోజూ పరగడుపున తాగాలి. 


ఎసిడిటీ నుంచి విముక్తి


నల్ల ఉప్పు, హీంగ్ నీళ్లు  తాగడం వల్ల ఎసిడిటీ సమస్య పూర్తిగా దూరమౌతుంది. ఈ రెండింటినీ నీళ్లతో కలిపి తాగడం వల్ల కడుపుకు చలవ చేస్తుంది.


మలబద్ధకం దూరం


నల్ల ఉప్పు, హీంగ్ నీళ్లు మెటబోలిజంను బూస్ట్ చేస్తాయి. ఈ నీళ్లు తాగడం వల్ల కడుపు పూర్తిగా క్లీన్ అవుతుంది. ఈ నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, అజీర్థి సమస్యలు దూరమౌతాయి.


డయాబెటిస్‌కు ప్రయోజనం


నల్ల ఉప్పు, హీంగ్ నీళ్లు డయాబెటిస్‌కు చెక్ పెట్టడంలో కీలకంగా ఉపయోగపడతాయి. ఈ నీళ్లు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. నిద్రలేమి సమస్యకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. 


Also read: Hangover Home Remedies: పార్టీ తర్వాత హ్యాంగోవర్‌ అయిందా.. ఈ 5 సహజసిద్ధమైన హోం రెమెడీస్‌తో ఇట్టే తగ్గిపోతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook