Weight Loss Tips: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. ఫలితంగా స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్ ఏర్పడి నలుగురిలో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, సులభంగా బరువు తగ్గించేందుకు కొన్ని పద్ధతులున్నాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా అధిక బరువు లేదా స్థూలకాయం అనేది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయితే బరువు తగ్గించుకునే క్రమంలో చాలా పద్ధతులు అవలంభిస్తుంటారు. ఈ పద్ధతులు అవలంభించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మేలు జరగాల్సింది పోయి నష్టం చేకూరుతుంది. అందుకే ఎప్పుడూ సహజసిద్ధమైన పద్ధతులతోనే బరువు తగ్గించేందుకు తద్వారా కేలరీలు కరిగించేందుకు ప్రయత్నించాలి. చాలామంది వ్యాయామం లేదా వర్కవుట్స్ ద్వారా అవసరం కంటే ఎక్కువ మోతాదులో కేలరీలు బర్న్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రోజుకు ఎన్ని కేలరీలు బర్న్ చేసుకోవచ్చనే విషయంలో పరిమితి కచ్చితంగా ఉంది. ఇది దాటకుండా ప్రయత్నించుకోవచ్చు.


బరువు ఎంత వేగంగా తగ్గించుకోవాలని అనుకున్నా..ఒకరోజులో శరీర సామర్ధ్యం ప్రకారం 300 నుంచి 500 కేలరీలకు మించి బర్న్ చేయకూడదు. కొవ్వు కరిగించేందుకు హెల్తీ విధానమిది. అందుకే ఆరోగ్య నిపుణుల సలహా లేకుండా ఏ పనీ చేయకూడదు. రోజుకు మీరు ఎంత ఫ్యాట్ తీసుకుంటున్నారో దానిపై ఆధారపడుతుంది ఎంత మొత్తంలో కేలరీలు బర్న్ చేయాలో.


కేలరీలు సులభంగా బర్న్ చేసేందుకు కొన్ని స్పష్టమైన పద్ధతులున్నాయి. ప్రతిరోజూ కనీసం 30-60 నిమిషాలు వ్యాయామం చేయాలి. పొరపాటున కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ వదలకూడదు. ఫ్యాట్ తక్కువగా ఉండే హెల్తీ ఆరోగ్యం తీసుకోవాలి. రిఫ్రెష్‌మెంట్ కోసం టీ స్థానంలో గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకుంటే మంచిది. కేలరీలు ఎక్కువగా ఉండే స్వీట్స్ తినడం మానేయాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.


ఎక్కువ కేలరీలు బర్న్ చేసే క్రమంలో ఓవర్ ఎక్సర్‌సైజ్ లేదా ఓవర్ వర్కవుట్స్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది. ఫలితంగా తీవ్రమైన అలసటకు తోడజు మజిల్స్ పెయిన్, బాడీ వీక్నెస్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. బరువు తగ్గించుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఒక్కటే సరిపోదు. కొన్ని హెల్తీ డైట్స్ కూడా తీసుకోవాలి.


కేలరీలు తక్కువగా ఉండే తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా బాదం తినాలి. ప్రతిరోజూ పెరుగు తప్పకుండా సేవించాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫ్యాట్ పేరుకోకుండా ఉంటుంది. ప్రోటీన్ పుడ్ కోసం రెడ్ మీట్ కంటే గుడ్లు బెటర్. డైట్‌లో చేపలు మంచి ప్రత్యామ్నాయం. అయితే నూనె తక్కువగా వినియోగించాలి. సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో కూడా బరువు తగ్గించుకోవచ్చు.


Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook