Children Vaccine: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ త్వరలో 18 ఏళ్లలోపువారికి కూడా అందనుంది. చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే చిన్నారులకు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్(Vaccination)కార్యక్రమంలో కోవాగ్జిన్ కీలకంగా ఉంది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ నుంచి ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ అందింది. చిన్నారులకు సైతం వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. 18 ఏళ్లలోపువారికి సైతం కోవాగ్జిన్(Covaxin) ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఫేజ్ 2,3 క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. వచ్చేవారం క్లినికల్ ట్రయల్స్ నివేదికను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించనున్నట్టు భారత్ బయోటెక్ కంపెనీ ఛైర్మన్ కృష్ణా ఎల్లా తెలిపారు.


డీసీజీఐ (DCGI)అనుమతి లభించిన వెంటనే చిన్నారులకు సైతం వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. 18 ఏళ్లలోపు చిన్నారులకిచ్చే వ్యాక్సిన్ ఉత్పత్తి అక్టోబర్ నాటికి 55 మిలియన్ డోసులకు చేరనుంది. సెప్టెంబర్ నెలలో 35 మిలియన్ డోసులు ఉత్పత్తి చేయనున్నారు. ముక్కు ద్వారా అంటే నాసల్ వ్యాక్సిన్(Nasal Vaccine)అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోంది.ఫేజ్ 2 ట్రయల్స్ వచ్చే నెలలో ముగుస్తాయి. వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించేది ముక్కేనని నిపుణులు తెలిపారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌తో ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది. నాసల్ ద్వారా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను 650 మందిపై నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కోవాగ్జిన్‌ను విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ ఛైర్మన్ కృష్ణా ఎల్లా చెప్పారు.


Also read: PM Modi Us Tour: మోదీ, జో బిడెన్ మధ్య చర్చకు రానున్న ఆ కీలక అంశాలేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook