Weight Loss Tips: బరువు తగ్గాలను కుంటున్నారా.. ఇలా 3 వారాల పాటు నల్ల జీలకర్రను తీసుకోండి చాలు..
Black Cumin For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైరన ఆహారాలను తీసుకుని బరువు పెరుగుతున్నారు. దీని వల్ల తీవ్ర గుండె పోటు, మధుమేహం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
Black Cumin For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైరన ఆహారాలను తీసుకుని బరువు పెరుగుతున్నారు. దీని వల్ల తీవ్ర గుండె పోటు, మధుమేహం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొందరైతే కఠిన వ్యాయామాలు చేస్తున్నారు.ఇక నుంచి ఇలాంటి శరీర వ్యాయామాలు చేయకుండా బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం నల్ల జీలకర్ర తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీర సమస్యలకు చెక్ పెడుతాయి. అయితే బరువు తగ్గించుకోవడానికి ఎలా ఈ జీలకర్రను తీసుకోవాలో మనం తెలుసుకుందాం..
బరువును ఇలా సులభంగా తగ్గిస్తుంది:
ఆధునిక జీవన శైలికారణంగా చాలా మందిలో కొవ్వు పేరుకుపోతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి నల్ల జీలకర్రను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా ఆహారాల్లో వీటిని వినియోగించడం వల్ల కొవ్వును తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 3 నెలల పాటు రోజూ ఆహారంలో భాగంగా వినియోగిస్తే చెడు కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయి.
నల్ల జీలకర్ర రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
నల్ల జీలకర్రలో ఉండే మూలకాలు శరీరం రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతాయి. ముఖ్యంగా వ్యాధులను నియంత్రించేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని విషపూరిత టాక్సిన్స్‌ను తొలగించి శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.
పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
నల్ల జీలకర్రను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల పొట్టలో సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా దృఢంగా తయారవుతుంది. జీలకర్రలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనిని ఆహారంలో భాగంగా తీసుకుంటే కడుపు నొప్పి, కడుపులో విరేచనాలు వంటి సమస్యల సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జలుబు, ఫ్లూలకు చెక్ పెట్టొచ్చు:
వానా కాలంలో జలుబు, దగ్గు రావడం చాలా సహజం. అయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమువుతే తప్పకుండా ఈ నల్ల జీలకర్రను వినియోగిచాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు కోరింత దగ్గు, బ్రోన్కైటిస్, అలెర్జీల వంటి శ్వాసకోశ వ్యాధులకు చెక్ పెడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook