Black Pepper Uses: మసాలా అంటే ఇండియానే గుర్తొస్తుంది ఎవరికైనా. భారతదేశంలో ఉపయోగించే మసాలాలు కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. మిరియాలతో కలిగే అద్భుత ప్రయోజనాల్ని ఇవాళ మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్లిమిరియాలను గరం మసాలాగా ఉపయోగిస్తుంటాం. ప్రతి భారతీయుడి కిచెన్‌లో ఇది తప్పకుండా ఉంటుంది. నల్లమిరియాల ద్వారా చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో కలిపి మిరియాలు తీసుకుంటే.. మానవ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఆ అద్భుత ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.


కడుపుకు మంచిది


మీ కడుపులో గ్యాస్ లేదా ఎసిడిటీ ఉంటే..నిమ్మరసంలో బ్లాక్‌సాల్ట్, బ్లాక్ పెప్పర్ వేసి తాగండి. కేవలం క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. 


సామర్ధ్యం పెంచుతుంది


గోరువెచ్చని నీటిలో నల్ల మిరియాల పౌడర్ కలుపుకుని తాగితే బాడీ స్టామినా పెరుగుతుంది. నీటి కొరత కూడా తీరుతుంది.


టెన్షన్ దూరం


నల్ల మిరియాల్లో ఉండే పిప్రైన్ కారణంగా ఇది యాంటీ డిప్రెషెంట్‌గా పనిచేస్తుంది. ప్రస్తుత రోజుల్లో సర్వ సాధారణంగా మారిన టెన్షన్ లేదా డిప్రెషన్ దూరం చేసేందుకు దోహదపడుతుంది. 


దంత చిగుర్ల నొప్పికి పరిష్కారం


నల్లమిరియాలతో దంత చిగుర్ల నొప్పి నుంచి చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు. నల్ల మిరియాలు, మాజూఫల్, రాక్‌సాల్ట్‌లను సమాన పాళ్లలో కలిపి పౌడర్‌గా చేసుకోవాలి. కొద్దిగా ఆవాల నూనెతో ఈ పౌడర్ మిక్స్ చేసి..దంతాలు, చిగుర్లలో రాసుకోవాలి. అరగంట తరువాత నోరు క్లీన్ చేసేయాలి. దీంతో దంతాలు , చిగుర్లలో నొప్పి సమస్య దూరమౌతుంది. 


కేన్సర్ నుంచి రక్షణ


మహిళలు నల్ల మిరియాలు తినడం చాలా ఉపయోగకరం. నల్లమిరియాల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫ్లైవనాయిడ్స్, కెరోటెన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 


జలుబు దూరం


ఇవే కాకుండా జలుబు చేసినప్పుడు కూడా పాలలో మిరియాల పౌడర్ కలుపుకుని తాగితే రిలీఫ్ లభిస్తుంది. తరచూ జలుబు చేయడం, తుమ్ములు రావడం వంచి సమస్యను దూరం చేస్తుంది. దీనికోసం రోజుకు ఒక మిరియాలతో ప్రారంభించి..రోజుకొకటి పెంచుకుంటూ పోవాలి. పదిహేను రోజులకు పదిహేను తీసుకునేలా చేయాలి. అక్కడి నుంచి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ పదిహేను రోజులపాటు తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also read; Health Insurance: మీరు ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook