Health Insurance: మీరు ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి

Health Insurance: ఆరోగ్య బీమా. అత్యవసరమైనప్పుుడు తప్పకుండా ఆదుకునేవి. మార్కెట్‌లో చాలా రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి. మరి ఎలాంటి పాలసీని ఎంచుకుంటే మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలివీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2022, 06:36 AM IST
Health Insurance: మీరు ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి

Health Insurance: ఆరోగ్య బీమా. అత్యవసరమైనప్పుుడు తప్పకుండా ఆదుకునేవి. మార్కెట్‌లో చాలా రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి. మరి ఎలాంటి పాలసీని ఎంచుకుంటే మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలివీ..

మనిషికి ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవల్సినప్పుడు వేలకు వేలు, లక్షలు కూడా ఖర్చయిపోతుంటుంది. అటువంటి సందర్భాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే మార్కెట్‌లో వివిధ కంపెనీల ఆరోగ్య బీమా పాలసీలు చాలానే ఉన్నాయి. ఈ పాలసీల్లో ఏది ఎంచుకుంటే మంచిదో ముందు తెలుసుకోవాలి. సాధారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటేనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఓపీడీ చికిత్సకు కూడా పాలసీలు వర్తిస్తున్నాయి. 

అందుకే మీరు తీసుకునే పాలసీకు ఓపీడీ చికిత్స వర్తిస్తుందో లేదో ముందుగా తెలుసుకోవాలి. ఈ విధమైన పాలసీల వల్ల ఆర్ధికంగా చాలా వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఆసుపత్రిలో చేరకుండానే చికిత్స జరిగిపోతోంది. ఓపీడీ ఖర్చుల్ని భరించే పాలసీ తీసుకోవడం వల్ల ఆసుపత్రిలో చేరకుండానే వైద్య నిపుణుల్నించి పొందే సేవలకు ఖర్చుల్ని పాలసీ భరిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, మధుమేహం, ఆర్ధరైటిస్, థైరాయిడ్ వంటి సమస్యలున్నవారు ఓపీడీ ఖర్చులు వర్తించే పాలసీలే ఎంచుకోవాలి. వైద్యంతో పాటు ఔషధ ఖర్చుల్ని కూడా చెల్లించగలగాలి.

సాధారణంగా జర్వం, జలుబు, దంత సమస్యలు, కంటి చూపు వంటి సమస్యల కోసం వైద్యుని సంప్రదిస్తే ఆ ఖర్చుల్ని పాలసీలు ఇవ్వవు. కానీ 100 శాతం కవరేజ్ ఇచ్చే పాలసీలను ఎంచుకుంటే ఇటువంటి చికిత్సల్లో కూడా పరిహారం కోరవచ్చు. సాధారణ ఆరోగ్య బీమా పాలసీల్లో ఇలాంటి ఓపీడీ ఖర్చులుండవు. వ్యాధిని గుర్తించే ప్రక్రియలో చేయించే బ్లడ్ టెస్టులు, సీటీ స్కానింగ్, ఎక్స్‌రే, సోనోగ్రఫీ, ఎంఆర్ఐ వంటి ఖర్చుల్ని భరించే పాలసీలైతే అధిక ప్రయోజనముంటుంది. 

Also read: Jackfruit: పనస పండు తిన్న తర్వాత వీటిని అస్సలు తినొద్దు...తింటే ఆరోగ్య సమస్యలే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News