COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Black Tea Benefits: చాలామంది టీలను ఎంతో ఇష్టపడి తాగుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల మైండ్ రిలాక్స్ అవ్వడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుందని నమ్ముతారు. అయితే కొంతమంది పాలతో తయారు చేసిన టీ ని విచ్చలవిడిగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీ కి బదులు బ్లాక్ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఎంతో ప్రభావంతంగా సహాయపడతాయి. 


ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ కారణంగా తీవ్రవ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు రెండుసార్లు బ్లాక్ టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రక్తంలోని పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు రక్తపోటు సమస్యలతో బాధపడే వారికి బ్లాక్ టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే మూలకాలు రక్తపోటును నియంత్రించేందుకు ప్రభావవంతంగా దోహదపడతాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ప్రతిరోజు బ్లాక్ టీ ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి పొట్ట సమస్యలైన మలబద్ధకం గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు బ్లాక్ టీ ని ఉదయం, సాయంత్రం రెండు పూటలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ టీ గుండె పనితీరును కూడా ప్రభావంతంగా మెరుగుపరుస్తుంది. పొట్టలోని బ్యాక్టీరియాను తగ్గించి క్లీన్ గా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది.  దీంతోపాటు మానసిక స్థితి మెరుగుపడి ఒత్తిడి నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తుంది. 


ఈ బ్లాక్ టీ లో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు తరచుగా వానాకాలంతో పాటు చలికాలంలో ఈ టీ ని తాగడం వల్ల జలుబు, దగ్గు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు పొట్టలో ఎప్పటినుంచో పేరుకుపోతున్న మలినాలు, వ్యర్ధపదార్థాలు కూడా యూరిన్ రూపంలో బయటికి వస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈటీవీ రెండు కప్పుల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి